Potatoes : ఆలుగడ్డలను చాలా మంది నిత్యం ఉపయోగిస్తుంటారు. వీటితో అనేక రకాల కూరలు, వంటకాలను చేస్తుంటారు. బిర్యానీ రైస్‌లలో, మసాలా వంటకాల్లో, ఇతర కూరల్లోనూ ఆలును వేస్తుంటారు. వాస్తవానికి ఆలుగడ్డలు చాలా రుచిగా ఉంటాయి. ఎలా వండినా వీటిని అందరూ ఇష్టంగానే తింటారు. అయితే ఆలుగడ్డలను తింటే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ వీటిని మోతాదుకు మించి తినరాదు. బంగాళాదుంపలను అధికంగా తినడం వల్ల ప్రయోజనాలు కలగకపోగా నష్టాలే ఎక్కువగా కలుగుతాయి. వీటిని మరీ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఉడికించి కొంత మోతాదులో తింటే ఫర్వాలేదు. కానీ వీటితో చిప్స్, టిక్కీ, ఫ్రెంచ్ ఫ్రైస్, మసాలాలు వేసి వండిన కూరలు వంటివి చేసి తింటేనే అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇలాంటివి తినడం వల్ల మీరు బరువు పెరుగుతారు. దీంతోపాటు డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.
బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ ఏర్పడవచ్చు మరియు మీకు పుల్లటి త్రేనుపు, గుండెల్లో మంట, కడుపులో గ్యాస్, వాపు మొదలైన సమస్యలు మొదలవుతాయి. బంగాళాదుంపలు తిన్న తర్వాత మీకు జీర్ణ సమస్యలు ఉంటే, దాని తీసుకోవడం తగ్గించడమే కాకుండా, మీరు బంగాళాదుంపలను తయారుచేసేటప్పుడు తక్కువ మసాలాలు మరియు నూనెను కూడా ఉపయోగించాలి.
మధుమేహంతో బాధపడేవారు బంగాళదుంపలను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. నిజానికి, బంగాళాదుంపల వినియోగం రక్తంలో చక్కెరను పెంచుతుంది, కాబట్టి బంగాళాదుంపలను ముఖ్యంగా ఖాళీ కడుపుతో మరియు రాత్రిపూట తినకూడదు. అలా తింటే షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అయితే మరీ అంతగా తినాలనిపిస్తే వీటిని తినేటప్పుడు ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతో ఎక్కువగా ఆలును తినలేరు. కంట్రోల్‌లో ఉంటారు. అప్పుడు దీని వల్ల కలిగే నష్టం కూడా తగ్గుతుంది. ఇలా ఆలుగడ్డలను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు అన్న విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…