Apple : సాధారణంగా మనలో అధికశాతం మంది ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. బెడ్‌పై ఉండే టీ లేదా కాఫీ తాగి కానీ ఏ పనీ మొదలు పెట్టరు. కొందరు ఉదయం నిద్రమత్తును వదిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు టీ, కాఫీలను తాగితే, మరికొందరికి అది అలవాటుగా ఉంటుంది. అయితే అసలు నిజానికి ఉదయం బెడ్ టీ, కాఫీకి బదులుగా బెడ్ ఆపిల్ తింటే ఎంతో మంచిదట. అవును, ఈ విషయాన్ని వైద్యులే స్వయంగా చెబుతున్నారు.
ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగేవారు వాటికి బదులుగా ఒక ఆపిల్‌ను తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్రమత్తు వదిలించుకుని యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ, టీలకు బదులుగా ఆపిల్ పండే బాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు. ఆపిల్‌లో ఉండే సహజ సిద్ధమైన చక్కెర (ఫ్రక్టోజ్) కాఫీ, టీలలో ఉండే కెఫీన్ కన్నా బాగా పనిచేస్తుందని, దీంతో ఉదయం బెడ్ కాఫీ, టీలను తాగేందుకు బదులుగా ఒక ఆపిల్‌ను తింటే యాక్టివ్‌గా ఉండవచ్చని, దాంతో మన శరీరానికి ఉదయాన్నే శక్తి లభించి ఉత్సాహంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఉదయాన్నే అలా ఆపిల్ పండును తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయని, ఇది ఎంతో ఆరోగ్యవంతమైన ప్రయోజనాలను కూడా ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరింకెందుకాలస్యం.. వెంటనే బెడ్ కాఫీ, బెడ్ టీలకు బదులు రోజూ ఒక ఆపిల్ తిని చూడండి.. ఫలితాలను బట్టి మీరే పై విషయాలను అంగీకరిస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…