Skin Rashes : మన శరీరంలో అనేక పనులు సక్రమంగా జరగాలన్నా.. శరీర అవయవాలకు పోషణ అందాలన్నా.. మనం అనేక పోషకాలు కలిగిన ఆహారాలను నిత్యం తీసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే పలు విటమిన్లు మన శరీరానికి పోషణ అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని రకాల విటమిన్లు అందకపోతే.. మనకు పలు రకాల చర్మ సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉంటుందంటే అందుకు విటమిన్ ఎ లోపం కారణం కావచ్చు. విటమిన్ ఎ చర్మాన్ని సంరక్షిస్తుంది. కనుక అది లోపిస్తే.. చర్మం పొడిగా మారుతుంది. ఇలా గనక జరిగితే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను తింటే ఈ సమస్య పోతుంది. విటమిన్ ఎ మనకు కోడిగుడ్లు, మాంసం, పాలు, చీజ్, క్రీమ్, లివర్, కిడ్నీలు, చేపలు, పాలకూర, యాప్రికాట్స్, క్యారెట్లు, ఆపిల్స్ తదితరాల్లో లభిస్తుంది.
చర్మంపై దద్దుర్లు వస్తున్నా, నోటి పూత ఉన్నా, నాలుక పగిలినట్లు కనిపిస్తున్నా.. దాన్ని విటమిన్ బి2 లోపంగా అనుమానించాలి. అలాంటప్పుడు ఈ విటమిన్ ఉన్న ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. విటమిన్ బి2 మనకు పాలు, చీజ్, పెరుగు, తృణ ధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలు, కోడిగుడ్డు తెల్లనిసొన, మాంసం, కిడ్నీలు, లివర్‌లో లభిస్తుంది. విటమిన్ బి3 లోపం ఉంటే తరచూ గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ క్రమంలో విటమిన్ బి3 ఉండే చేపలు, మాంసం, కోడిగుడ్లు, పాలు, తృణ ధాన్యాలు, పుట్టగొడుగులు, నట్స్ తదితర ఆహారాలను తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. విటమిన్ బి6 లోపం ఉంటే.. పెదాలు బాగా పగులుతాయి. నోటిపూత వస్తుంది. చర్మంపై దురద, ర్యాషెస్ వస్తాయి. దీన్ని నివారించాలంటే.. విటమిన్ బి6 ఉండే చేపలు, గుడ్లు, కూరగాయలు తీసుకోవాలి.
చర్మం పాలిపోయినట్లు ఉన్నా, పొడిగా మారినా దాన్ని విటమిన్ బి7 లోపంగా భావించాలి. అలాంటి వారు లివర్, పల్లీలు, కోడిగుడ్డు పచ్చసొన, చికెన్, పుట్టగొడుగులు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. విటమిన్ బి12 లోపం ఉంటే చర్మం పసుపు రంగులోకి మారుతుంది. దీన్ని నివారించాలంటే.. విటమిన్ బి12 ఎక్కువగా ఉండే.. మాంసం, లివర్, చీజ్, పాలు, కోడిగుడ్లను ఎక్కువగా తీసుకోవాలి. చర్మంపై ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తున్నా, చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నా దాన్ని విటమిన్ సి లోపంగా భావించాలి. విటమిన్ సి ఉండే నారింజ, ద్రాక్ష, బొప్పాయి, టమాటాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర వంటివి తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
చర్మం దురదగా ఉండడం, చర్మంపై పొర పొలుసులుగా మారి ఊడి రావడం.. తదితర లక్షణాలు కనిపిస్తే.. దాన్ని సోరియాసిస్ అంటారు. దీనికి వైద్యులు ఇచ్చే మెడిసిన్‌తోపాటు విటమిన్ డి ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. విటమిన్ డి ఎక్కువగా కోడిగుడ్డు పచ్చనిసొన, లివర్, ఉప్పునీటి చేపలు, పాలు, పుట్టగొడుగుల్లో మనకు లభిస్తుంది. మన శరీరంలో విటమిన్ ఇ లోపిస్తే.. చర్మం ముడతలుగా వచ్చినట్లుగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు చర్మంపై కనిపిస్తాయి. దీన్ని నివారించాలంటే.. విటమిన్ ఇ ఉండే.. సన్‌ఫ్లవర్ ఆయిల్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…