Pulipiri Removal Tips : ప్రస్తుత తరుణంలో పులిపిర్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వంశపారంపర్య కారణాలతోపాటు థైరాయిడ్, డయాబెటిస్ వంటి వ్యాధులు కూడా పులిపిర్లు వచ్చేందుకు కారణం అవుతుంటాయి. శరీరం అంతా అందంగా ఉన్నా పులిపిర్లు ఉంటే మాత్రం అందవిహీనంగా కనిపిస్తారు. దీంతో పులిపిర్లను పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన చికిత్సలను తీసుకుంటారు. అయితే అలా అవసరం లేకుండా పలు చిట్కాలను పాటిస్తే పులిపిర్లను వదిలించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పులిపిర్లను తగ్గించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో వాడుతుంటాం. అయితే వెల్లుల్లిని మెత్తగా చేసి పులిపిర్లపై రాస్తుండాలి. దీంతో పులిపిర్లు తగ్గుతాయి. అయితే ఇలా రాత్రిపూట చేసి ఉదయం కడిగేస్తే మంచిది. దీంతో సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇక పులిపిర్లను తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎంతగానో పనిచేస్తుంది. దీన్ని నేరుగా పులిపిర్లపై రాయవచ్చు. ఇందుకు గాను ఒక పాత్రలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకుని అందులో కాటన్ బడ్‌ను ముంచాలి. అనంతరం దాంతో పులిపిరి ఉన్న చోట సుమారుగా 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటు సమస్య నుంచి బయట పడవచ్చు.

టీ ట్రీ ఆయిల్‌ను కూడా పులిపిర్లను తగ్గించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇది కూడా సమస్య నుంచి బయట పడేలా చేస్తుంది. అలాగే కలబంద గుజ్జును ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే మాలిక్ యాసిడ్ పులిపిర్లను తొలగిస్తుంది. దీంతోపాటు ఆముదం, బేకింగ్ సోడా మిశ్రమం లేదా అరటి పండు తొక్కతో కూడా పులిపిర్ల సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే ఇవి ప్రయత్నించినా పులిపిర్ల సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.