Ghee : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నెయ్యిని ఉపయోగిస్తున్నారు. చిన్నారులకు తల్లులు నెయ్యి కలిపి ఆహారం పెడతారు. నెయ్యి పిల్లలకు మంచి బలం అని వారు అలా పెడతారు. ఇక నెయ్యితో మనం అనేక వంటకాలను కూడా చేస్తుంటాం. అయితే నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని, అది మంచిది కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి వల్ల మన ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. కానీ దీన్ని అధికంగా తినరాదు. మోతాదులోనే తీసుకోవాలి. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గ్లాస్ పాలలో ఒక టీస్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు, మిరియాలు వేసి తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నెయ్యి జీవక్రియల రేటు మెరుగు పరిచేలా చేస్తుంది. ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రోబయోటిక్ ఫుడ్‌గా పనిచేస్తుంది. దీంతో పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ కె2 సమృద్ధిగా లభిస్తుంది. ఎముకలు క్యాల్షియంను గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గేందుకు పనిచేస్తుంది. 5 గ్రాముల నెయ్యిలో 44.8 క్యాలరీలు, 4.9 గ్రాముల కొవ్వు ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. డయాబెటిస్, ఒబెసిటి, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు డాక్టర్ సలహా మేరకు నెయ్యిని తీసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…