Cheese And Butter : చాలా మంది ప్రస్తుత తరుణంలో చీజ్ లేదా బటర్‌ను తింటున్నారు. వీటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లు మొదలుకొని రాత్రి చేసే డిన్నర్ వరకు అనేక రకాల వంటల్లో వాడుతున్నారు. ఇక బేకరీ ఐటమ్స్‌లో వీటిని తప్పక వాడుతారు. అయితే ఈ రెండింటినీ ఎక్కువగా తింటున్నవారికి ఐసీఎంఆర్ చేదువార్త చెప్పింది. ఎందుకంటే ఈ రెండింటినీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ జాబితాలో చీజ్, బటర్ చేరడం వల్ల ఇక అవి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావని వైద్యులు చెబుతున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకు బయట లభించే రెడీ టు ఈట్ ఫుడ్స్ అన్నమాట. నిల్వ చేసిన ఆహారాలు, చిప్స్, కుకీస్, స్వీట్లు వంటివి ఈ జాబితాకు చెందుతాయి. అయితే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఇంకా ఎక్కువగా ప్రాసెస్ చేయబడినవని అర్థం. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్నా మిక్కిలి హానికరమైనవని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అసలు తినకూడదు. తింటే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరాటా, పిజ్జా, పఫ్స్, పేస్ట్రీలు, కేకులు వంటి అనేక బేకరీ ఐటమ్స్‌లో బటర్, చీజ్ వాడుతారు. కనుక ఈ పదార్థాలను తినడం అసలు ఇంక ఏమాత్రం మంచిది కాదు. కనుక వీటిని ఎక్కువగా తింటున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక చీజ్, బటర్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…