lifestyle

Cotton Buds : చెవిలో గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Cotton Buds : చాలా మంది ఇళ్ల‌లో కాట‌న్ బ‌డ్స్ ఉంటాయి. వీటిని అనేక ర‌కాల ప‌నుల కోసం ఉప‌యోగిస్తుంటారు. అయితే వీటితో చాలా మంది ఎక్కువ‌గా చెవుల్లో గులిమి తీస్తుంటారు. చెవుల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే వాస్త‌వానికి చెవుల్లో గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగించ‌డం అంత మంచిది కాద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చెవుల్లో అంత‌ర్భాగం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంట‌ప్పుడు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వారు అంటున్నారు. ఇక గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను వాడ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో వారు వివ‌రిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెవుల్లో గులిమి అనేది స‌హ‌జ సిద్ధంగా ఏర్ప‌డే ప‌దార్థం. చెవుల్లో ఉండే బాక్టీరియా, వ్య‌ర్థాలు, దుమ్ము, ధూళి అంతా క‌లిసి గులిమిలా త‌యార‌వుతుంది. ఇది చెవులకు మేలు చేస్తుంది. ఇది బాక్టీరియా, వైర‌స్‌లు లోప‌లికి రాకుండా అడ్డుకుంటుంది. చెవుల‌ను ర‌క్షిస్తుంది. అయితే ఎప్పుడైతే కాట‌న్ బ‌డ్స్ పెట్టి గులిమి తీస్తామో అప్పుడు ఈ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. ఫ‌లితంగా సూక్ష్మ క్రిములు చెవుల అంత‌ర్భాగంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది. అప్పుడు చెవుల్లో ఇన్‌ఫెక్ష‌న్లు క‌ల‌గ‌వ‌చ్చు. అలాగే గులిమిని తీసేట‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో అది చెవి లోప‌లి భాగం వైపు నెట్టివేయ‌బ‌డుతుంది. దీంతో చెవుల్లో గులిమి ఏర్ప‌డే ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో చెవి బ్లాక్ చేయ‌బ‌డి వినికిడి లోపం త‌లెత్త‌వ‌చ్చు.

Cotton Buds

ఈఎన్‌టీ వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం చెవుల్లో లోప‌లి వైపు చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీనిపై కాట‌న్ బ‌డ్‌ను అటు ఇటు రాపిడి క‌ల‌గ‌జేస్తే అక్క‌డ వాపు ఏర్ప‌డి చ‌ర్మం డ్యామేజ్ అవ‌చ్చు. దీంతో నొప్పి, దుర‌ద‌, మంట ఏర్ప‌డుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో ర‌క్త‌స్రావం అయ్యేందుకు కూడా అవ‌కాశాలు ఉంటాయి. అలాగే అక్క‌డ కాట‌న్ బ‌డ్‌తో ప‌దే ప‌దే రుద్ద‌డం వ‌ల్ల చ‌ర్మం దృఢంగా అయి గులిమి ఏర్ప‌డే అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోతాయి. దీంతో అక్క‌డంతా బ్లాక్ అయిన‌ట్లు అవుతుంది. ఫ‌లితంగా శాశ్వ‌తంగా వినికిడి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

అందువ‌ల్ల చెవుల‌ను చాలా ఆరోగ్యంగా, సుర‌క్షితంగా ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే మ‌రి చెవిలో ఏర్ప‌డే గులిమి వ‌ల్ల చిరాకు పెడుతుంటే ఏం చేయాలి ? అని అంద‌రికీ సందేహం రావ‌చ్చు. అందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువైతే దుర‌ద పెడుతుంది. దీంతో చిరాకు వ‌స్తుంది. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు కాట‌న్ బ‌డ్ ల‌ను పెట్టాల్సిన ప‌నిలేదు. చెవుల్లో రెండు చుక్క‌ల కొబ్బ‌రినూనె వేస్తే చాలు. కొబ్బరినూనెలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో చెవుల్లో దుర‌ద త‌గ్గుతుంది. అలాగే గులిమి దానంత‌ట అదే బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక ఇలా చేయ‌లేమ‌ని అనుకుంటే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. దీంతో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM