lifestyle

Banana Face Pack : అర‌టి పండు, తేనెతో మీ ముఖం అందం రెట్టింపు అవుతుంది..!

Banana Face Pack : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండు జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది. ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. శ‌క్తిస్థాయిల‌ను పెంచుతుంది. అర‌టి పండు మ‌న ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో అంద‌రికీ తెలుసు. అయితే అర‌టి పండు మీ చ‌ర్మ కాంతిని కూడా పెంచుతుంద‌ని మీకు తెలుసా ? అర‌టి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఫైబ‌ర్‌, పొటాషియం, విట‌మిన్ సి, విట‌మిన్ బి6. ఇలా ఎన్నో సూక్ష్మ పోష‌కాలు ఈ పండ్ల‌లో ఉంటాయి. అర‌టి పండ్లు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప‌లు ఇత‌ర ప‌దార్థాల‌తో క‌లిపి ఫేస్ ప్యాక్‌ల‌ను త‌యారు చేసి ఉప‌యోగించ‌డం వ‌ల్ల మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. మీరు అనుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి.

ప్ర‌తి ఒక్క‌రు క్లీన్‌గా మ‌చ్చ‌లు లేని ముఖం ఉండాల‌ని కోరుకుంటారు. ఇందుకు గాను మార్కెట్‌లో ల‌భించే అనేక ర‌కాల ఖ‌రీదైన సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల‌ను కొని వాడుతుంటారు. అయితే ఇవి అప్ప‌టిక‌ప్పుడు ఫ‌లితాన్ని ఇచ్చినా వీటిని దీర్ఘ‌కాలికంగా ఉప‌యోగిస్తే ఇవి కెమిక‌ల్స్ కాబ‌ట్టి మ‌న చ‌ర్మానికి, మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు వచ్చే ప్ర‌మాదం ఉంటుంది. క‌నుక మ‌నం ఎల్ల‌ప్పుడూ అందాన్ని పెంచుకునేందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఉత్ప‌త్తుల‌నే ఉప‌యోగించాలి. అలాంటి ప‌దార్థాల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. దీంతో అందాన్ని ఎలా పెంచుకోవ‌చ్చో ఇప్పుడు చూద్దాం.

Banana Face Pack

బాగా పండిన ఒక అర‌టి పండును తీసుకుని అందులో డార్క్ చాకొలెట్ వేసి క‌ల‌పాలి. అందులోనే రోజ్ వాట‌ర్‌ను కూడా పోసి మెత్త‌గా ప‌ట్టుకోవాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ రెడీ అవుతుంది. దీన్ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాల‌పాటు ఉన్నాక క‌డిగేయాలి. అలాగే అర‌టి పండు, తేనె మిశ్ర‌మం కూడా ప‌నిచేస్తుంది. అర‌టి పండులో హైడ్రేటింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని మృదువుగా, తేమ‌గా ఉంచుతాయి. అలాగే తేనె చ‌ర్మం యొక్క పీహెచ్ స్థాయిల‌ను బ్యాలెన్స్ చేస్తుంది. చ‌ర్మానికి తేమ‌ను అందిస్తుంది. ముఖంపై ముడ‌త‌ల‌ను త‌గ్గిస్తుంది. అందువ‌ల్ల ఈ రెండింటి మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి. ఇలా వారంలో క‌నీసం 3 సార్లు చేస్తే మీ ముఖంలో కాంతి పెరుగుతుంది. మొటిమ‌లు త‌గ్గుతాయి.

మీకు కాంతివంత‌మైన, మ‌చ్చ‌లు లేని ముఖం కావాలంటే అర‌టి పండు, ప‌చ్చి పాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ రెండింటి మిశ్ర‌మంలో కాస్త తేనె వేసి బాగా క‌లిపి ముఖానికి రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి. అలాగే అర‌టి పండు, నిమ్మ‌కాయ మిశ్ర‌మాన్ని కూడా ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. బాగా పండిన అర‌టిపండులో అర టీస్పూన్ నిమ్మ‌ర‌సం, కాస్త తేనె క‌లిపి పేస్ట్‌లా చేసి దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా రాయాలి. 30 నిమిషాలు అయ్యాక క‌డిగేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. మీ ముఖం క‌ళ‌గా మారుతుంది. మొటిమ‌లు, మచ్చ‌లు ఉండ‌వు. ఇలా ఈ అర‌టి పండు ఫేస్ ప్యాక్‌ల‌తో మీ ముఖ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM