lifestyle

How Many Steps : రోజూ ఎన్ని అడుగుల దూరం న‌డిస్తే మంచిదో తెలుసా..?

How Many Steps : క‌ఠిన‌త‌ర‌మైన వ్యాయామాలు చేయ‌లేని వారి కోసం అందుబాటులో ఉన్న స‌ర‌ళ‌త‌ర‌మైన వ్యాయామం ఒక్క‌టే.. అదే వాకింగ్‌.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారైనా స‌రే.. వాకింగ్ చేయ‌వచ్చు. దీంతో శ‌రీరంపై ఒత్తిడి ప‌డ‌కుండా ఉంటుంది. కీళ్ల‌నొప్పులు ఉన్న‌వారు కూడా వాకింగ్ ఎలాంటి అభ్యంత‌రం లేకుండా చాలా సునాయాసంగా చేయ‌వ‌చ్చు. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో వ్యాయామం కాదు క‌దా.. క‌నీసం వాకింగ్ చేసేందుకు కూడా వీలుండడం లేదు. కానీ నిత్యం ఏదో ఒక స‌మ‌యంలో వాకింగ్ క‌చ్చితంగా చేయాలి. దీంతో కొంత వ‌రకైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు, హైబీపీ, డ‌యాబెటిస్ అదుపులో ఉంటాయి. పొట్ట త‌గ్గుతుంది. అయితే.. నిత్యం ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిద‌నే సందేహం చాలా మందికి ఉంటుంది. దీంతో అస‌లు వాకింగ్ చేయ‌డ‌మే మానేస్తుంటారు. అయితే డాక్ట‌ర్లు చెబుతున్న ప్రకారం నిత్యం మనం 10వేల అడుగుల దూరం న‌డ‌వాల్సి ఉంటుంది. అంత న‌డ‌వ‌లేక‌పోతే క‌నీసం 5వేల అడుగులు అయినా న‌డ‌వాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

How Many Steps

10వేల అడుగుల న‌డ‌క స‌రే.. కానీ అన్ని వేల అడుగుల దూరం న‌డిచిన‌ట్లు మ‌న‌కు ఎలా తెలుస్తుంది..? అంటే.. అందుకు మ‌న‌కు మార్కెట్‌లో పెడోమీట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. లేదా.. స్మార్ట్‌ఫోన్‌లో పెడోమీట‌ర్ యాప్ వేసుకున్నా చాలు.. మీరు న‌డిచిన‌ప్పుడు మీ వెంట ఫోన్‌ను ఉంచుకోండి. అందులో పెడో మీట‌ర్ యాప్‌ను ఆన్ చేయండి చాలు.. అది మీరు ఎన్ని అడుగుల దూరం న‌డిచారో చాలా సుల‌భంగా చెప్పేస్తుంది. అదీ కుద‌ర‌క పోతే మ‌న‌కు మార్కెట్‌లో ఫిట్‌నెస్ ట్రాక‌ర్లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనూ పెడోమీట‌ర్ ఉంటుంది. దీనివ‌ల్ల వాకింగ్ చేసిన‌ప్పుడు వాటిని చేతికి ధ‌రిస్తే.. వాటిలో ఉండే పెడోమీట‌ర్ మ‌నం న‌డిచిన దూరాన్ని ఇట్టే చెప్పేస్తుంది. దీంతో మ‌నం ఎన్ని అడుగులు న‌డిచామో వాటిలో చూసుకుని ఆ మేర 5వేలు లేదా 10వేల అడుగుల కోటాను రోజూ పూర్తి చేయ‌వ‌చ్చు. క‌నుక ఇంకెందుకాల‌స్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 10వేల అడుగులు న‌డ‌వడం ప్రారంభించండిక‌..!

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM