lifestyle

Dandruff : చుండ్రును త‌గ్గించే నాచుర‌ల్ టిప్స్‌.. వీటిని ఫాలో అయిపొండి..!

Dandruff : జుట్టు సమస్యలనేవి సహజంగానే చాలామందికి సీజన్లతో సంబంధం లేకుండా వస్తూనే ఉంటాయి. ఏ సీజన్లో అయినా సరే జుట్టు సమస్యలు కామన్. జుట్టు సమస్యల్లో ప్రధానంగా చాలామందికి ఉండేది చుండ్రు. చుండ్రు వల్ల తలంతా దురదగా ఉంటుంది. దీంతో పాటు జుట్టు చిట్ల‌డం జరుగుతుంది. చుండ్రు కారణంగా చాలామంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని తగ్గించుకునేందుకు అనేక ప్రొడక్ట్స్‌ను వాడుతుంటారు. అయితే ఇవి దీర్ఘకాలంలో అంత ప్రభావ‌వంతంగా ఉండవు. కానీ కొన్ని స‌హ‌జ‌సిద్ధమైన ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు నుండి బయటపడవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రును తగ్గించేందుకు పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగును మీరు నేరుగా తలకు పట్టించవచ్చు. కాస్త పెరుగును తీసుకొని జుట్టుకు అప్లై చేసి గంట సేపు తర్వాత తేలిక‌పాటి షాంపూతో తల స్నానం చేయాలి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది. వారంలో కనీసం రెండు నుంచి మూడుసార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. పెరుగులో మీరు అరటిపండు లేదా కోడిగుడ్డు, కొబ్బరి నూనెలను కూడా కలుపుకోవచ్చు. చుండ్రును తగ్గించడంలో మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని గ్రైండ్ చేసి పేస్టులా పట్టుకోవాలి.

Dandruff

ఈ పేస్ట్ ను మీ జుట్టుకు అప్లై చేసి 25 నుంచి 35 నిమిషాలు ఆగాలి. తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. వేప చెట్టు ఆకులు కూడా చుండ్రును తగ్గించడంలో పనిచేస్తాయి. వేప ఆకులను కొన్ని తీసుకొని పేస్టులా చేసి దాన్ని తలకు రాయాలి. 30 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. వారంలో ఇలా రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. దురద కూడా తగ్గుతుంది. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ మైక్రోబియల్, యాంటీఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించి దురదను పోగొడతాయి. టీ ట్రీ ఆయిల్ ను మీరు కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు నుంచి బయటపడవచ్చు.

చుండ్రును తగ్గించుకునేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను మీరు జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాలు ఆగి కడిగేయాలి. అయితే దీన్ని తలకు అప్లై చేసేముందు ప్యాచ్‌ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల కొందరికి అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM