Egg 65 : కోడిగుడ్లతో మనం అనేక రకాల కూరలను చేసుకుని తినవచ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒకటి. చికెన్ 65, ఫిష్ 65, మటన్ 65.. ఇలా అనేక రకాల వాటిని తయారు చేసినట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తినవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. మరి ఎగ్ 65 ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎగ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 6, అల్లం – 2 ముక్కలు, వెల్లుల్లి – 6 నుంచి 10 రెబ్బలు, పచ్చిమిర్చి – 6, కొత్తిమీర – ఒక కప్పు, కరివేపాకు – ఒక కప్పు, గరం మసాలా – 4 టీస్పూన్లు, కారం – తగినంత, కశ్మీరీ కారం పొడి (రంగు కోసం) – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, పెరుగు – 2 కప్పులు, చిల్లీ సాస్ – కొద్దిగా, జీలకర్ర పొడి – 2 లేదా 3 టీస్పూన్లు, చక్కెర – 2 టీస్పూన్లు, కార్న్ ఫ్లోర్ – 1 లేదా 2 కప్పులు.
ఎగ్ 65 తయారు చేసే విధానం..
కోడిగుడ్లను ఉడకబెట్టి వాటిల్లో ఉండే పచ్చసొన తీసేసి తెల్ల సొన మాత్రమే తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలకు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరం మసాలా, బ్రెడ్ ప్రౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పెట్టుకోవాలి. రెండు కోడిగుడ్లను పగలగొట్టి వాటిల్లో నుంచి తెల్లసొన తీసి ఆ మిశ్రమంలో బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆ ఉండలను వేస్తూ వాటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి కాగానే అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరప కాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అనంతరం అందులో పెరుగు వేసి కొద్దిగా ఉడకగానే కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, చిల్లీ సాస్ వేయాలి. చక్కెర వేస్తే రుచి బాగుంటుంది. తరువాత కొత్తిమీర వేయాలి. అనంతరం ముందుగా వేయించి పెట్టుకున్న ఉండలను వేయాలి. మంట కాస్త పెంచి ముక్కలకు గ్రేవీ బాగా పట్టేవరకు ప్యాన్‌ను అటు ఇటు తిప్పాలి. బాగా ఉడికింది అనుకుంటే.. వెంటనే దించేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఎగ్ 65 తయారవుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…