Fruits : ఉదయం ఖాళీ కడుపుతో మనం రోజూ అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. ఉదయాన్నే కొండరు పరగడుపునే బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అలా తాగకపోతే వారికి సంతృప్తి ఉండదు. కాఫీ, టీ లతోనే వారు రోజును ప్రారంభిస్తారు. ఇక కొందరు భిన్న రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే ఉదయం పరగడుపునే పండ్లు తినేవారు మాత్రం కొన్ని రకాల పండ్లను తినకూడదు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఏయే పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదో, వాటి వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో సిట్రస్ పండ్లను తినకూడదు. సిట్రస్ పండ్లు అంటే నిమ్మ, నారింజ లాంటివన్నమాట. వీటిని తింటే తాజాగా ఫీల్ వస్తుంది. అయితే వీటిని ఉదయం ఖాళీ కడుపుతో తినరాదు. ఎందుకంటే వీటిల్లో ఉండే ఆమ్లాలు గుండెల్లో మంట, పొట్టలో అసౌకర్యం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కలగజేస్తాయి. కనుక ఉదయం పరగడుపునే సిట్రస్ పండ్లను తినకూడదు. అలాగే టమాటాలను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటి జ్యూస్ కూడా తాగకూడదు. టమాటాల్లో టానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పొట్టలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీంతో అసిడిటీ ఎక్కువవుతుంది. కనుక ఉదయం పరగడుపున టమాటాలను తీసుకోరాదు.
అరటి పండ్లు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి రుచి కూడా బాగుంటుంది. అయితే అరటి పండ్లలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు అరటి పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తింటే అది క్యాల్షియంతో ప్రభావితం అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అరటి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు.
పైనాపిల్ పండ్లు అన్నా కూడా చాలా మందికి ఇష్టమే. వీటిని జ్యూస్‌గా చేసుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే పైనాపిల్ పండ్లలో బ్రొమెలియిన్ ఉంటుంది. ఇది పొట్టలో యాసిడ్ల శాతాన్ని పెంచుతుంది. దీంతో పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కనుక పైనాపిల్ పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే జామ పండ్లు, పుచ్చకాయలు, కివి, మామిడి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిల్లోనూ విటమిన్ సి, పలు రకాల యాసిడ్లు ఉంటాయి. ఇవి జీర్ణాశయానికి మంచివి కావు. కాబట్టి ఈ పండ్లను ఉదయం పరగడుపున తీసుకోరాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…