దేశంలోని ప్రముఖ ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ సంస్థ టీసీఎస్ డిగ్రీ, పీజీ, సీఏ చదివిన అభ్యర్థులకు చక్కని ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. ఐటీ రంగంలో రాణించాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరవడం ద్వారా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్‌కు చెందిన కార్యాలయాల్లో ఈ వాకిన్ ఇంటర్వ్యూలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులను టీసీఎస్ ఫుల్ టైమ్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. డిగ్రీ, పీజీ లేదా సీఏ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఫ్రెషర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కార్యాలయంలో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా టీసీఎస్ కార్యాలయాల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
టీసీఎస్‌లో సీఏ ఆర్‌టీఆర్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఫ్రెషర్స్ లేదా 3 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎస్ఏపీ లేదా ఒరకిల్‌లో అనుభవం ఉండాలి. అభ్యర్థులు తమ రెజ్యూమ్, సీఏ సర్టిఫికెట్, ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డుతో వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అలాగే పైథాన్ డెవలపర్, అజర్ డేటా ఇంజినీర్, అజుర్ డెవ్ ఆప్స్ ప్రొఫెషనల్ పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు డిగ్రీ లేదా పీజీ చదివి ఉండాలి. సంబంధిత విభాగాల్లో నైపుణ్యాలను కలిగి ఉండాలి. ఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.
టీసీఎస్‌లో ఈ ఉద్యోగాలకు ఎంపికైతే అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ లభిస్తుంది. దీంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, ఎంప్లాయి స్టాక్ ఆప్షన్స్ వంటి ఇతర సదుపాయాలను కూడా అందిస్తారు. కనుక ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలిస్తే నేరుగా టీసీఎస్‌లో జరుగుతున్న వాకిన్ ఇంటర్వ్యూలకు తమ పత్రాలతో హాజరు కావచ్చు. మరిన్ని వివరాలకు https://www.tcs.com/careers అనే అధికారిక సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.\