---Advertisement---

ఏపీ ప్ర‌భుత్వంలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM
---Advertisement---

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంలోని ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అమ‌రావ‌తి సెక్రెటేరియ‌ట్‌లోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ జాబ్ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప‌లు విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదిక‌న ఖాళీగా ఉన్న 66 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారు.

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 25వ తేదీ వ‌ర‌కు మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://rtgs.ap.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్లోని డీసీసీబీల్లో ఉద్యోగాల భ‌ర్తీకి సైతం నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు.

RTGS AP Recruitment 2025 know full details

మొత్తం పోస్టులు 66 ఉండ‌గా, ఆర్‌టీజీఎస్ పోస్టులు 2, ఎవేర్ హ‌బ్ 3, ఆర్‌టీజీఎస్ అడ్మినిస్ట్రేష‌న్ 7, డేటా ఇంటిగ్రేష‌న్ అండ్ అన‌లిటిక్స్ హ‌బ్ 8, ప్రొడ‌క్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ హ‌బ్ 6, ఏఐ అండ్ టెక్ ఇన్నొవేష‌న్ హ‌బ్ 10, పీపుల్ ప‌ర్సెప్స‌న్ హ‌బ్ 20, మ‌ల్టీ సోర్స్ విజువ‌ల్ ఇంటెలిజెన్స్ హ‌బ్ పోస్టులు 10 ఉన్నాయి. చీఫ్ డేటా సెక్యూరిటీ ఆఫీస‌ర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, మేనేజర్‌, డేటా అనలిస్ట్‌, జనరల్‌ మేనేజర్‌- హెచ్‌ఆర్‌, మేనేజర్‌- ఆఫీస్‌ అడ్మిన్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్స్‌, డేటా అర్కిటెక్ట్‌, డేటా గవర్నెన్స్‌ మేనేజర్‌, డేటా సైంటిస్ట్‌/ అనలిస్ట్‌, డేటా ఇంజినీర్స్‌/ డేటా సెక్యూరిటీ అండ్‌ కంప్లైన్స్‌ మేనేజర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, డైరెక్టర్‌, ఫుల్‌ స్టాక్‌ డెవెలపర్స్‌/ సీనియర్‌ డెవలపర్‌/ టీం లీడ్‌/ ఫ్రంట్‌ ఎండ్‌ డెవెలపర్స్‌, క్యూఏ అండ్‌ టెస్టింగ్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు త‌మ బ‌యో డేటాను జ‌న‌వ‌రి 25వ తేదీ లోగా jobsrtgs@ap.gov.in అనే మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now