ONGC Recruitment 2023 : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? మీకు ఇదే గుడ్ న్యూస్. ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కొన్ని ఖాళీలు వున్నాయి. అర్హులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసేయవచ్చు 10వ తరగతి పూర్తి చేసిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసేయవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. 2500 అప్రెంటీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
సొంత ఊర్లోనే పని చేయవచ్చు. టెన్త్ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసేసుకోవచ్చు. స్త్రీ, పురుష అభ్యర్థులిద్దరూ కూడా ఈ పోస్టులకి అర్హులే. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీనిలో మొత్తం 2500 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. కాకినాడ విభాగం లో 78 పోస్టులు, రాజమండ్రి విభాగంలో 102 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళ వయస్సు 18 నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలి. 5 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు సడలింపు వుంది. OBC వారికి 3 సంవత్సరాలు సడలింపు వుంది. ఇక విద్యార్హత వివరాలు చూస్తే.. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
క్యాబిన్/రూమ్ అటెండెంట్ పోస్టులకి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. డ్రస్సర్ (మెడికల్) పోస్టులకి 10వ తరగతి పూర్తి చేయాలి. హౌస్ కీపర్ (కార్పొరేట్) పోస్టులకి కూడా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకునే వాళ్ళు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి కానీ కింద లింక్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకో వచ్చు.
https://www.apprenticeshipindia.gov.in/