ది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. CISFలో ఖాళీగా ఉన్న మొత్తం 1124 కానిస్టేబుల్ పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు గాను జనరల్ విభాగంలో 460 ఖాళీలు ఉండగా, ఎస్సీ 167, ఎస్టీ 83, ఓబీసీ 303, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 111 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను లెవల్ 3 పోస్టులుగా పరిగణిస్తున్నారు. వీటికి గాను రాత పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు 100 మార్కులతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయాలి.
మొత్తం పోస్టుల్లో 845 పోస్టులు కానిస్టేబుల్, డ్రైవర్ పోస్టులు కాగా 279 పోస్టులు డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. డ్రైవింగ్ వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు సడలింపులు ఇచ్చారు.
అభ్యర్థులకు వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ అండ్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. మార్చి 4ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://cisfrectt.cisf.gov.in/index.php అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న…
దేశంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ టెక్ మహీంద్రా పలు విభాగాల్లో ఆసక్తి, అర్హత ఉన్న…
CSIR నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIIST) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి…
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఉఏన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో పలు విభాగాల్లో పనిచేయడానికి గాను ఆసక్తి, అర్హత…
మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవకాశం మీ కోసమే. ఎందుకంటే బీహార్లోని పాట్నాలో ఉన్న…
దేశవ్యాప్తంగా ఉన్న పలు జోన్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి…