అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అస్సాం రైఫిల్స్ ఓ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది. మొత్తం 215 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేస్తారు. ఏప్రిల్ 3వ లేదా 4వ వారంలో ఇందుకు సంబంధించిన ర్యాలీని నిర్వహిస్తారు. ఈ పోస్టులకు పురుషులు, స్త్రీలు అప్లై చేయవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. అస్సాం రైఫిల్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం అభ్యర్థులకు వేతనాలను చెల్లిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెన్స్ (పీఈటీ), రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు గాను అభ్యర్థులు www.assamrifles.gov.in అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ పోస్టులకు గాను ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 21వ తేదీ వరకు గడువు విధించారు.
రెలిజియస్ టీచర్ పోస్టులకు గాను అభ్యర్థులు సంస్కృతంలో డిగ్రీ చేసి ఉండాలి. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రేడియో మెకానిక్ పోస్టులకు గాను టెన్ట్, డిప్లొమా చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. లైన్ మన్ ఫీల్డ్ పోస్టులకు గాను టెన్త్, ఐటీఐ చేసి ఉండాలి. వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. డ్రాట్స్మన్ పోస్టులకు గాను ఇంటర్, డిప్లొమా చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంజినీర్ ఎక్విప్మెంట్ మెకానిక్ పోస్టులకు గాను టెన్త్, ఐటీఐ చదవడంతోపాటు వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలక్ట్రిషియన్ మెకానిక్ వెహికల్ పోస్టులకు టెన్ట్, ఐటీఐ చదవడంతోపాటు వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్ హోల్స్టర్ పోస్టులకు టెన్త్, ఐటీఐ, ప్లంబర్ పోస్టులకు టెన్త్, ఐటీఐ చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివి ఉండాలి. వయస్సు 20 నుంచి 25 మధ్య ఎండాలి. ఎక్స్ రే అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, డిప్లొమా చదివి వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, డిప్లొమా చదివి వయస్సు 21 నుంచి 23 మధ్య ఉండాలి. సఫాయి పోస్టులకు టెన్త్ చదివి ఉండాలి. వయస్సు 18 నుంచి 23 మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారికి గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.200, రిజర్వ్డ్ కేటగిరిలకు చెందిన వారు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్మెన్కు అప్లికేషన్ ఫీజులో మినహాయింపులు ఇచ్చారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది.