చిత్రంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు చూశారా. చిన్న గోడపై కూర్చుని పేపర్‌పై పెన్నుతో ఏదో రాస్తున్నాడు. పక్కనే అందరూ లైన్‌లో పద్ధతిగా నిలుచుని ఉన్నారు. ఏంటి.. ఇదంతా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిత్రం వాస్తవానికి మీకు ఊహకు కూడా అందదు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. చిత్రంలో ఉన్న ఆయన పేరు శంకర్ గౌడ. ఈయన ఒక డాక్టర్. అవును, మీరు షాకవుతున్నా ఇది నిజమే. ఈయన ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్. అవును ఇంకా షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. ఈయనది కర్ణాటకలోని మండువా.
డాక్టర్ శంకర్ గౌడ మెడిసిన్‌లో గోల్డ్ మెడలిస్ట్. కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) మెడికల్ యూనివర్సిటీలో చదివారు. ఎండీ పట్టా కూడా పొందారు. అంతటి చదువు చదివినా, డాక్టర్ అయినా, గోల్డ్ మెడలిస్ట్ అయినా ఆయన ఎంత సింపుల్‌గా ఉన్నారో చూశారా. ఆయనను చూస్తే అసలు అంత ప్రతిభ ఉన్న డాక్టర్ అని ఎవరూ అనుకోరు. ఇక ఈయన ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం రూ.5 ఫీజు మాత్రమే తీసుకుంటారు. రోజూ ఎంతో మందికి ఇలా వైద్యం చేస్తారు. తాను ఉంటున్నది సిటీలో అయినా సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలకు రోజూ వెళ్లి అక్కడి ప్రజలకు కేవలం రూ.5 ఫీజు మాత్రమే తీసుకుని వైద్యం చేస్తారు.
ఇక ఆయన ప్రజలకు రాసే మందులు కూడా చాలా తక్కువ ధర కలిగినవే ఉంటాయి. సాధారణంగా ఈయన తన పేషెంట్లకు కేవలం జనరిక్ మందులను మాత్రమే రాస్తారు. ఇవి అయితేనే పేదలు కూడా కొనగలిగే ధరలకు వస్తాయి కాబట్టి డాక్టర్ శంకర్ తన పేషెంట్లకు జనరిల్ మందులనే రాస్తారు. ఇక ఈయన ఏదైనా ప్లేస్‌కు ఉదయం 7 గంటలకు వెళ్లారంటే మళ్లీ సాయంత్రం 7 అయ్యే వరకు అక్కడే ఉంటారు. రోజంతా ప్రజలకు వైద్యం అందిస్తూనే ఉంటారు.
ఒక గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండి తాను తలుచుకుంటే చక్కని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి లక్షలు లక్షలు సంపాదించవచ్చు. కానీ పేదలకు సేవ చేయాలని ఈయన ఇలా కేవలం రూ.5 ఫీజుకే వైద్యం అందిస్తున్నారు. ఇక ఈయన తాను వెళ్లాలనుకునే చోటుకి కూడా కారు, బైక్‌పై కాకుండా సైకిల్‌పైనే వెళ్తుంటారు. ఎలాంటి వైద్యం రాకపోయినా వేలకు వేలు వసూలు చేసే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రతిభ గల డాక్టర్ నిజంగా ఇలా సేవ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈయనను తప్పకుండా అభినందించాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…