భూమిపై అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటారు. కానీ కొందరికి కష్టాలు, కన్నీళ్లు నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో వారు ముందుకు సాగుతారు. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. ఆ బాలుడు కూడా సరిగ్గా ఇలాగే చేస్తున్నాడు.
అహ్మదాబా్‌లోని మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఓ 14 ఏళ్ల బాలుడు దహీ కచోరీ అమ్ముతుండడం ఓ ఫుడ్ బ్లాగర్ కంట పడింది. దోయాష్ పత్రబె అనే ఫుడ్ బ్లాగర్ ఆ బాలుడి వద్ద దహీ కచోరీ కొని తిన్నాడు. తరువాత ఆ బాలుడి గురించి ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
https://www.instagram.com/reel/CUFmgx3ImQm/?utm_source=ig_embed&ig_rid=612aefc0-05b7-4c34-be9d-3b3e7bbed057
ఆ బాలుడు కుటుంబాన్ని పోషించడం కోసం అలా రోడ్డు పక్కన ఆహారం అమ్ముతున్నాడని, అతనికి దాతలు సహాయం చేయాలని దోయాష్ పోస్ట్ పెట్టాడు. దీంతో చాలా మంది పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆ బాలుడికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఓ దశలో ఆ బాలుడు తన దీనగాథ చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. అయితే.. ఆ బాలున్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తుండడం విశేషం. ఆ బాలుడికి చెందిన ఈ వార్త అందరినీ కంట తడి పెట్టిస్తోంది.