Ceiling Fan Speed : వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటికి రావడమే మానేసారు. ఇంట్లోనే ఉండి ఫ్యాన్లు, కూలర్ లు, ఏసీ ల కింద ఎండ నుండి ఉపశమనాన్ని పొందుతున్నారు. అయితే ఇప్పటికి చాలా మంది వేసవికాలంలో ఫ్యాన్ లనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కూలర్లు, ఏసీలు వాడే స్తోమత లేని వారు ఫ్యాన్ లనే ఎంచుకుంటారు. కూలర్లు, ఏసీలు ఉన్నప్పటికి కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది అన్న ఉద్దేశ్యంతో కొందరు ఫ్యాన్ లనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే బయటికి వెళ్లి ఇంటికి రాగానే ముందుగా మనం ఫ్యాన్ స్విచ్ నే ఆన్ చేస్తూ ఉంటాము. అయితే వేసవికాలంలో ఫ్యాన్ కింద కూర్చున్నప్పటికి మనకు చెమట కారడం తగ్గదు.
ఉక్కపోత తగ్గదు. దీంతో చాలా మంది ఫ్యాన్ స్పీడ్ తక్కువగా వస్తుంది అని అంటుంటారు. కొందరైతే ఫ్యాన్ ను రిపేర్ చేస్తూ ఉంటారు కూడా. కొందరు పాత ఫ్యాన్ ను తీసేసి ఆ స్థానంలో కొత్త ఫ్యాన్ ను పెడుతూ ఉంటారు. దీని వల్ల ఖర్చు ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఇలా ఫ్యాన్ ను రిపేర్ చేసే పని లేకుండా, కొత్త ఫ్యాన్ ను తెచ్చే పని లేకుండా ఉండాలంటే అసలు వేసవికాలంలో ఫ్యాన్ ఎందుకు తక్కువ స్పీడ్ తో తిరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి. వేసవికాలంలో తక్కువ ఓల్టేజ్ ఉంటుంది. వేసవికాలంలో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. దీని కారణంగా ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుంది.
అలాగే బలహీనమైన కండెన్సర్ ఉండడం వల్ల కూడా ఫ్యాన్ తక్కువ స్పీడ్ తో తిరుగుతుంది. ఓల్టెజ్ సరిగ్గా ఉన్నప్పటికి ఫ్యాన్ తక్కువ స్పీడ్ తో తిరిగితే అది కండెన్సర్ సమస్యే అని గుర్తించాలి. ఓల్టెజ్ సమస్యను మనం ఎలాగు సరిచేయలేము. ఒకవేళ కండెన్సర్ సమస్య అయితే దీనిని మనం సులభంగా సరిచేయగలము. మెకానిక్ తో పని లేకుండా కండెన్సర్ ను మీరే మార్చవచ్చు. మీ ఫ్యాన్ కు సరిపోయే కొత్త కండెన్సర్ ను కొనుగోలు చేసి ఇంటి మెయిన్ ను ఆఫ్ చేసి కండెన్సర్ ను మార్చుకుంటే సరిపోతుంది. కండెన్సర్ మార్చడం వల్ల మీ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. ఫ్యాన్ పాతది అయినప్పటికి కొత్తదానిలా ఎక్కువ వేగంతో తిరుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…