Fruits : తరచూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఒక్కో రకమైన పండును తినడం వల్ల అనేక విధాలైన ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన కీలకపోషకాలు కూడా లభిస్తాయి. అయితే మీకు తెలుసా..? కొన్ని రకాల పండ్లను మాత్రం మనం తొక్క తీయకుండానే తినాలట. అవును, మీరు విన్నది నిజమే. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
యాపిల్ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి. అయితే ఇవి యాపిల్ పండ్లలో ఎలా ఉంటాయో వాటి తొక్కలో కూడా అంతే విధంగా ఉంటాయి. కనుక యాపిల్ పండ్లను తొక్క తీయకుండా అలాగే తినాలి. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. అంతేకాదు, పియర్స్ పండ్ల తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అవి మనకు కలిగే వాపులను, నొప్పులను తగ్గించుకునేందుకు ఉపయోగపడతాయి.
చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసి తింటారు. అయితే అలా కాకుండా తొక్కతోనే నేరుగా తినాలి. దీని వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. దీంతోపాటు పొటాషియం, ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు మనకు లభిస్తాయి. కివీ పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తొలగిపోతుంది. జీర్ణ సమస్యలు మాయమవుతాయి.
మామిడి పండ్లను కూడా చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయకూడదు. మామిడి పండ్లను తొక్కతో అలాగే తినాలి. దీని వల్ల వాటిలో ఉండే కెరోటినాయిడ్లు, పాలీఫినాల్స్, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. అవి క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులను దూరం చేస్తాయి. కనుక ఈ పండ్లను తప్పనిసరిగా తొక్కతోనే తినాల్సి ఉంటుంది. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…