Healthy : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే కచ్చితంగా మీరు ఆరోగ్యంగా లేనట్లే. వీటిలో ఏ లక్షణం మీలో ఉన్నా మీరు ఆరోగ్యంగా లేనట్లు తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి వేసినప్పుడు నీళ్లు తాగకండి. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. ఆకలి వేసినప్పుడు తినాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవడం, వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
మీ మూత్రం చిక్కగా, పచ్చగా వస్తుంటే మీరు ఆరోగ్యంగా లేరని అర్థం. ఎండలో వెళ్ళినప్పుడు శరీరంలో చుర్రుమని అనిపిస్తున్నట్లయితే మీరు ఆరోగ్యంగా లేనట్లు. శరీరం వేడిగా ఉంటే కూడా ఆరోగ్యంగా లేనట్లు. మూత్రం వెళ్లినప్పుడు దుర్వాసన ఎక్కువగా వస్తుంటే కూడా మీరు ఆరోగ్యంగా లేనట్లు అర్థం. నిద్ర లేచాక నోటి నుండి దుర్వాసన ఎక్కువగా వస్తున్నట్లయితే మీరు ఆరోగ్యంగా లేరని దానికి సంకేతం.
నాలుక మీద పాచి మందంగా ఉంటే ఆరోగ్యంగా లేనట్లే. స్నానం చేసిన రెండు మూడు గంటల్లోనే చర్మం నుండి వాసన వస్తుంటే ఆరోగ్యంగా లేనట్లు. కడుపునొప్పి వస్తుంటే కూడా ఆరోగ్యంగా లేరని దానికి సంకేతం. ఇందులో ఏం కనబడినా కూడా మీరు ఆరోగ్యంగా లేరని దానికి అర్థం. కాబట్టి ఆరోగ్యకరమైన చిట్కాలు పాటించి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా ముఖ్యం.
రోజు కనీసం 8 గంటల పాటు నిద్రపోండి. అదేవిధంగా ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఒత్తిడి వలన చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్ గా ఉండే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి. వ్యాయామం, మెడిటేషన్ కోసం కొంచెం సమయాన్ని వెచ్చించాలి. అప్పుడు కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…