Yellow Teeth : పసుపు రంగులోకి మారిన దంతాలతో మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దంతాల కారణంగా నలుగురితో సరిగ్గా మట్లాడలేక, చక్కగా నవ్వలేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉంటాయి. ధూమపానం చేయడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, పంచదార ఎక్కువగా ఉండే శీతల పానీయాలను తాగడం వంటి వివిధ రకాల కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. పసుపు రంగులోకి మారిన ఈ దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే టూత్ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల పసుపు రంగులో ఉండే దంతాలు తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి.
దంతాలను తెల్లగా మార్చే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ముందుగా తెల్లగా ఉండే ఒక టూత్ పేస్ట్ ను ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును తీసేసి మెత్తగా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ ను కూడా గిన్నెలో వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. తరువాత ఇందులో చిటికెడు పసుపును వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల దంతాలను తెల్లగా మార్చే పేస్ట్ తయారవుతుంది.
ఇప్పుడు ఈ పేస్ట్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను తరచూ ఉపయోగించే పేస్ట్ వలె ఉపయోగించాలి. అలాగే ఈ టూత్ పేస్ట్ ను ఉపయోగించేటప్పుడు ధూమపానం, మద్యపానం వంటి వాటిని ఆపేయాలి. ఈ టూత్ పేస్ట్ ను బ్రష్ తో తీసుకుని 3 నుండి 4 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకోవాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వెల్లుల్లితో టూత్ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారడంతో పాటు దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చిగుళ్ల నుండి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దంతాలు పసుపు రంగులో ఉన్న వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…