ఆరోగ్యం

Walking Without Shoes : వారానికి ఒక‌సారైనా చెప్పుల్లేకుండా వాకింగ్ చేయాల‌ట‌.. ఎందుకో తెలుసా..?

Walking Without Shoes : ఆధునిక కాలం, మోడ్రన్ స్టైల్ పేరుతో పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగుతున్న కాలం ఇది. ఇంట్లో మొత్తం నున్నని పాలిష్ బండలు, ఇంకా స్మూతైన చెప్పులు.. ఎక్కడా పాదాలకు గరుకు తగిలేది లేదు. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు, మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు, వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్, కాకుంటే స్పోర్ట్స్ షూస్.. ఇంకా అయితే ఫార్మల్ షూస్.. ఇలా టైమ్ ను బట్టి ఏదో ఒక‌ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం.

ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు. మన పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లల్లో, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా తిరగడం మూలాన ఎంతో యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. స్ట‌యిల్ పేరుతో బెడ్ రూం లోకి కూడా చెప్పులొచ్చేశాయ్. ఇలాచేసి పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం గానీ శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలా మందికి తెలియదు. ఇప్పటి నుంచైనా ఇక మీదట వారానికి ఒక‌సారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి. లేదంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Walking Without Shoes

వారానికి ఒక‌సారి చెప్పుల్లేకుండా ఒక కిలోమీట‌ర్ దూరం న‌డ‌వ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా గుచ్చుకోవడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది. ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సహనం పెరుగుతుంది. ఓపిక వ‌స్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొందుతారు.

మానవుని పాదాల్లో 72వేల నరాల చివ‌ర్లు ఉంటాయి. ఎక్కువసేపు పాదరక్షలు వాడడం వల్ల సున్నితమైన ఈ నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఇక మీదట పార్క్ లలో, ఆపీస్ లలో, ఇంట్లో.. చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

ఏ వయసు వారు ఎంతదూరం న‌డ‌వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 40 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి రోజూ కనీసం 3.75 కిలోమీటర్లు నడవాలి. 45 సంవత్సరాల‌ నుంచి 50 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.5 కిలోమీటర్లు నడవాలి. 50 సంవత్సరాల‌ నుంచి 55 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.1 కిలోమీటర్లు నడవాలి. 55 సంవత్సరాల‌ నుంచి 60 సంవత్సరాల‌ వరకు వయస్సు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 2.8 కిలోమీటర్లు నడవాలి.

60 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు ప్రతి రోజు కనీసం 2.5 కిలోమీటర్లు నడవాలి. ఒక సర్వే ప్రకారం ఏ మనిషి అయితే ప్రతి వారం కనీసం 2 గంటలు నడుస్తాడో అతనికి 40 శాతం మిగ‌తా వారికన్నా వ్యాధులు వ‌చ్చేందుకు త‌క్కువ‌గా అవ‌కాశాలు ఉంటాయి. రోజూ వాకింగ్ చేయడం వల్ల ఒంట్లోని కొవ్వు కరుగుతుంది. మన రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. రోజూ నడవడం వలన మధుమేహం రాకుండా ఉంటుంది. రోజూ వాకింగ్, ఇత‌ర వ్యాయామాలు చేస్తే హార్ట్ ఎటాక్ లాంటివి రావడానికి అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక రోజూ న‌డ‌క‌ను అల‌వాటు చేసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM