Walking Without Footwear : ఆధునిక కాలం, మోడ్రన్ స్టైల్ పేరుతో పడకగదిలో కూడా చెప్పులేసుకొని తిరుగాడుతున్న కాలం ఇది. ఇంట్లో మొత్తం నున్నని పాలిష్ బండలు, ఇంకా స్మూతైన చెప్పులు.. ఎక్కడా పాదాలకు గరుకు తగిలేది లేదు. ఉదయం బెడ్ మీద నుండి దిగింది మొదలు మళ్లీ రాత్రి బెడ్ మీద పడుకునే వరకు కాళ్లను మాత్రం ఖాళీగా ఉంచే పరిస్థితే లేదు. వీలైతే స్లిప్పర్లు, లేకుంటే శాండిల్స్, కాకుంటే స్పోర్ట్స్ షూస్.. ఇంకా అయితే ఫార్మల్ షూస్.. ఇలా టైమ్ ను బట్టి ఏదో ఓ పాదరక్షలను బిగించి మరీ మన పాదాల్ని కప్పేస్తున్నాం. ఇది ఏమాత్రం ఒంటికి మంచిది కాదని చాలా మందికి తెలియదు.
మన పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లల్లో, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా తిరగడం మూలాన ఎంతో యాక్టివ్ నెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టయిల్ పేరుతో బెడ్ రూంలోకి కూడా చెప్పులొచ్చేశాయ్. ఇలాచేసి పాదాలను రక్షిస్తున్నామని అనుకుంటున్నాం గానీ శరీరానికి శిక్ష వేసుకుంటున్నామని చాలామందికి తెలియదు. ఇప్పటి నుంచైనా ఇక మీదట వారానికోసారైనా ఒక కిలోమీటర్ దూరం చెప్పుల్లేకుండా నడిచే ప్రయత్నం చేయండి. లేకుంటే మీ ఆరోగ్యం డేంజర్ లో పడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

వారానికి కనీసం ఒక కిలోమీటర్ దూరం అయినా సరే చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. చెప్పులు లేకుండా తరచూ నడవడం వల్ల పాదాల్లో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. పాదాల్లో 72వేల నాడుల కొనలు ఉంటాయి. ఈ క్రమంలో చెప్పులు లేకుండా నడిస్తే ఆ కొనలకు గరుకుదనం తగులుతుంది. ఇది నాడులను ఉత్తేజ పరుస్తుంది. ఇలా ఆక్యుప్రెషర్ అవుతుంది. ఫలితంగా నాడులు యాక్టివేట్ అవుతాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. రోజూ గంటల తరబడి కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది. నేల మీద చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇసుక, చిన్న చిన్న రాళ్లు కాళ్లకు సుతిమెత్తగా గుచ్చుకోవడం ద్వారా మీ బీపీ కంట్రోల్ అవుతుంది. ఏదో కొత్త స్పర్శను కాలి పాదాలు పొందడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సహనం పెరుగుతుంది.
ఎక్కువసేపు పాదరక్షలు వాడటం వల్ల సున్నితమైన పాదాల కొనల నరాలు చచ్చుబడిపోతాయి. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అవి యాక్టివ్ గా ఉంటాయి. కాబట్టి ఇక మీదట పార్క్ లలో, ఆపీస్ లలో, ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.