Strawberry For Face : మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో స్ట్రాబెర్రీలు కూడా ఒకటి. వీటిని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ వీటిని పోషకాలకు పవర్ హౌస్‌గా చెప్పవచ్చు. అందువల్ల స్ట్రాబెర్రీలు కనిపిస్తే అసలు విడిచిపెట్టకండి. తప్పక తెచ్చుకుని తినండి. వీటి ద్వారా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు తగ్గుతాయి. ఇక స్ట్రాబెర్రీలతో మన చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మందికి ఎండాకాలం ముఖం మీద ఎర్రటి కురుపులు అవుతుంటాయి. అటువంటి వాళ్లు స్ట్రాబెర్రీ, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే ఆ కురుపులు మటుమాయమవుతాయి. ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది. పొడిబారిన చర్మానికి, జిడ్డు చర్మానికి స్ట్రాబెర్రీ ద్వారా చెక్ పెట్టొచ్చు. దాని కోసం స్ట్రాబెర్రీ ముక్కలను పెరుగు మీగడతో కలిపి మిక్స్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఎక్కడైతే పొడిబారిపోయిన చర్మం ఉంటుందో అక్కడ రుద్దాలి. జిడ్డు చర్మం ఉంటే.. పెరుగు, స్ట్రాబెర్రీ ముక్కలను కలిపి మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని రుద్దాలి. ఓ పది నిమిషాలు ఆగి.. తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేస్తే ముఖం మీద ఉన్న మొటిమలు కూడా మాయమయిపోతాయి.
స్ట్రాబెర్రీ గుజ్జును తీసుకొని కోకోవా పౌడర్, తేనె కలిపి దాన్ని ముఖానికి పెట్టుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది. బియ్యం పిండిలో స్ట్రాబెర్రీ గుజ్జును కలిపి.. దాన్ని ఫేస్ ప్యాక్‌లాగానూ వాడుకోవచ్చు. ముఖానికి రుద్దుకొని కాసేపు ఆగి కడుక్కుంటే చర్మం నిగనిగలాడుతుంది. ఇలా స్ట్రాబెర్రీలతో మనం మన చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…