Sleep : ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా రోజూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా పలు నియమాలని పాటించాలి. నిజానికి పెద్దలు చెప్పిన కొన్ని నియమాల వెనుక సైన్స్ దాగి ఉంది. మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేస్తే దాని వలన అనవసరంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పూర్వకాలంలో పెద్దలు పిల్లలకి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్పేవారు.
లేచే సమయంలో కుడివైపుకి తిరిగి లేవమని అనేవారు. అలా చెప్పడానికి ముఖ్య కారణం భోజనం చేసిన తర్వాత ఆహారం అంతా కూడా జఠరకోశంలో ఉంటుంది. జీర్ణమైన తర్వాత ఆహారం అక్కడ నుండి చిన్న పేగుల్లోకి వెళ్లే దారి కుడివైపు ఉంటుంది. అయితే మనం సరిగ్గా నిద్రపోకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. హృదయం శరీరానికి ఎడమ వైపు ఉంటుంది. హృదయం నుండి శుద్ధరక్తం అన్ని భాగాలకు వెళ్లే ముఖ్య రక్తనాళం కుడిభాగం నుండి మొదలవుతుంది.
మనం రాత్రి సమయంలో కుడివైపుకు తిరిగి పడుకుంటే శుద్ధ రక్తం కోసం కొంచెం ఎక్కువగా స్రవిస్తుంది. శుద్ధరక్తం రాత్రిపూట ఎక్కువగా అవసరం లేదు. అంటే నిద్రించే టైంలో ఎక్కువ పరిణామాలలో అక్కర్లేదు. లిమిట్ గా అయితే సరిపోతుంది. కుడివైపుకి తిరిగి నిద్రపోవడం వలన మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా జఠరకోశం నుండి చిన్న పేగులకి బలవంతంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది.
దీంతో కడుపులో వికారం కలుగుతుంది. ఇలా పలు సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రి పూట ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవాలి. అలాగే మనం నిద్రలేచేటప్పుడు ఎడమ వైపుకి తిరిగి నిద్రలేస్తే శరీరంలో కొంత భారం ఎడమవైపు ఉన్న హృదయం మీద పడుతుంది. కాబట్టి కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకుని నిద్రపోయేటప్పుడు, లేచేటప్పుడు చూసుకోండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…