Sandalwood For Beauty : ఒకప్పుడు మన పూర్వీకులకు స్నానం చేసేందుకు సబ్బులు ఏవీ ఉండేవి కాదు. దీంతో సున్నిపిండి లాంటి సహజసిద్ధమైన పదార్థాలతోనే స్నానం చేసేవారు. అలా సహజసిద్ధమైన పదార్థాలను వాడేవారు కాబట్టి ఎలాంటి చర్మ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. అలాగే చర్మం కాంతివంతంగా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నవన్నీ కెమికల్ ప్రొడక్ట్సే. అందువల్ల మనకు అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. పైగా చర్మం కాంతివంతంగా అందంగా మారుతుందని చెప్పి అనేక రకాల సబ్బులను, బాడీ వాష్‌లు, లోషన్ లను ఉపయోగిస్తున్నాం. కానీ వాటి వల్ల అనుకున్న ఫలితం రావడం లేదు. పైగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందువల్ల మనం సహజసిద్ధమైన వాటిని వాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఇక సహజసిద్ధమైన పదార్థాలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. చందనం. అవును దీన్ని చాలా మంది ఎక్కువగా దైవ కార్యాల్లో ఉపయోగిస్తుంటారు. కానీ దీంతో మనం ఎంతో మేలు పొందవచ్చు. ముఖ్యంగా దీన్ని చర్మ సంరక్షణకు, చర్మానికి అందాన్ని తెచ్చేందుకు వాడవచ్చు. చందనం పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. లేదా చందనం కర్రలు కూడా లభిస్తాయి. వీటిని అరగదీస్తే చందనం గంధం వస్తుంది. దీన్ని అయినా సరే ఉపయోగించవచ్చు. చందనం పొడిలో నీళ్లు కలిపి అనంతరం వచ్చే పేస్ట్‌ను శరీరం మొత్తానికి రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఎంతో మార్పు కనిపిస్తుంది. చర్మం మృదువుగా మారడమే కాదు.. కాంతివంతంగా మారి మెరుస్తుంది. నల్లని చర్మం పోయి తెల్లని చర్మం వస్తుంది. తెల్లగా మారాలనుకునేవారికి చందనం ఇలా ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు.
చందనం పొడి ఉపయోగించడం వల్ల చర్మంలో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. ఇలా క్రమం తప్పకుండా చందనాన్ని వాడుతూ ఉండడం వల్ల అలాంటి పదార్థాలు పూర్తిగా తగ్గుతాయి. దీంతో చర్మం ఆటోమేటిగ్గా తెల్లగా కనిపిస్తుంది. ఇలా చర్మ కాంతిని పెంచుకోవచ్చు. అలాగే చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా పోతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది.
అయితే మార్కెట్‌లో మనకు చందనంతో తయారైన శాండల్‌వుడ్ సబ్బులు అనేకం లభిస్తున్నాయి. కానీ వాటికి బదులుగా నేరుగా చందనాన్నే ఉపయోగిస్తే మంచిది. దీంతో వేగంగా ఫలితాన్ని రాబట్టవచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. చర్మం అత్యంత సహజసిద్ధంగా రంగు మారినట్లు అవుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. కనుక చందనం పొడిని తరచూ వాడడం వల్ల ఎంతో అందంగా మారవచ్చు. చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…