ఆరోగ్యం

Rice Powder For Face : బియ్యం పిండితో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం ఎంత‌లా మారిపోతుందంటే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Rice Powder For Face : బియ్యప్పిండిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా పనిచేసి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బియ్యం పిండి వంటలకు మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఫేమస్ ఏషియన్ బ్యూటీ సీక్రెట్ అని కూడా అంటారు. బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. కళ్ళ కింది నల్లని చారలు, నల్లని వలయాలు వయస్సైన వారి లక్షణాలను సూచిస్తాయి. బియ్యం పిండిలో ఆముదం నూనెను మిక్స్ చేసి, కళ్ళ కింద‌ ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే వృద్ధాప్య‌ లక్షణాలను కనబడనివ్వకుండా డార్క్ సర్కిల్స్ ను మాయం చేస్తుంది.

బియ్యం పిండిలో కొద్దిగా కీరదోసకాయ జ్యూస్ మిక్స్ చేసి ఫేస్ కు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మాన్ని టైట్ గా మార్చి చర్మంపై వయస్సైన లక్షణాల‌ను కనబడనివ్వదు. ఇది టాన్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బియ్యం పిండిలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ నేచురల్ రెమెడీ సూర్యరశ్మి నుండి వెలువడే అతినీల‌లోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అందుకోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అందులో కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే చర్మంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది.

Rice Powder For Face

బియ్యం పిండిలో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. 15 నిముషాల‌ తర్వాత కడిగేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకోవడం వల్ల చర్మంలో అద్భుతమైన మార్పు వస్తుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయంటే చర్మం చూడడానికి చాలా డల్ గా కనబడుతుంది. చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ను ఎఫెక్టివ్ గా నివారించడంలో బియ్యం పిండి హెల్ప్ చేస్తుంది. బియ్యం పిండిలో తేనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్‌ సెల్స్ తొలగిపోయి కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.

బియ్యం పిండిని జల్లించి అందులో మొక్కజొన్న పొడిని మిక్స్ చేసి మీరే స్వయంగా పౌడర్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్ల చర్మంపై ఎక్కువ జిడ్డు కనబడదు. ఎక్కువ సమయం పాటు నేచురల్ స్కిన్ ను కలిగి ఉంటారు. ఇది చ‌ర్మానికి మెరుపును అందాన్ని ఇస్తుంది. ఇలా బియ్యం పిండిని వివిధ ర‌కాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌ర్మానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తారు. రంగు మారుతుంది. వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు. య‌వ్వ‌నంలో ఉన్న‌ట్లు ఉంటారు. క‌నుక బియ్యం పిండిని ఒక‌సారి ట్రై చేసి చూడండి. అద్భుత‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM