మూత్రం.. మన శరీరంలోని రక్తంలో ఉండే పలు వ్యర్థ పదార్థాల మిశ్రమం. దాన్నంతటినీ మూత్రం రూపంలో కిడ్నీలు వడబోస్తాయి. అలా విడుదలైన మూత్రం మూత్రాశయంలోకి చేరుతుంది. అక్కడ మూత్రం నిండుతుందనగానే మెదడు మూత్రానికి వెళ్లాలని సిగ్నల్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో మనం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విసర్జన విషయానికి వస్తే పురుషులు, స్త్రీలు భిన్న రకాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే పురుషులు నిలబడి చేస్తారు. కొందరు పురుషులు కూడా కూర్చునే మూత్ర విసర్జన చేస్తారు. అది వేరే విషయం. కానీ మీకు తెలుసా..? పురుషులు నిలబడి కాక, కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఎంతో ఉపయోగం ఉంటుందట. అవును, మీరు విన్నది నిజమే.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది కూర్చునే మూత్ర విసర్జన చేస్తారట. ఈ క్రమంలో అలా మూత్ర విసర్జన చేసే వారిలో చాలా మంది ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతున్నారట. అనేక మందికి మూత్రాశయ సంబంధ సమస్యలు లేవట. అంతెందుకు, ఒకప్పుడు మన తాతలు, ముత్తాతలు చాలా వరకు కూర్చునే మూత్ర విసర్జన చేసే వారు గమనించారా..? ఆ.. అవును, కానీ ఇప్పుడు అధిక శాతం మంది నిలబడే మూత్ర విసర్జన చేస్తున్నారు. అయితే ఇలా కంటే కూర్చుని మూత్ర విసర్జన చేస్తేనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. అవేమిటంటే..
సాధారణంగా మూత్రంలో ఉండేవన్నీ వ్యర్థ పదార్థాలే. ఈ క్రమంలో వ్యాధిగ్రస్తుల నుంచి వచ్చే మూత్రంలో ఒక్కోసారి బాక్టీరియా కూడా ఉంటుంది. దీంతో వారు నిలుచుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆ బాక్టీరియా అంతా బాగా వెదజల్లినట్టు అవుతుంది. అలా వెదజల్లినట్టు పడే బాక్టీరియా ఇతరుల శరీరాల్లోకి సులభంగా ప్రవేశిస్తుందట. అందుకే కూర్చుని మూత్ర విసర్జన చేస్తే బాక్టీరియా అంతా ఒకే దగ్గర ఉండి అంతటా విస్తరించదు. కూర్చుని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి ఎంతో శుభ్రతను అందించినట్టు అవుతుందట.
మూత్రాశయ, శృంగార సంబంధ సమస్యలు ఉన్నవారు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే దాంతో ఆయా సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందట. కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మూత్రాశయం నుంచి మూత్రం పూర్తిగా బయటకు వస్తుందట. ఇది కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుందట. కనుక పురుషులు ఎవరైనా సరే నిలుచునే కంటే కూర్చుని మూత్ర విసర్జన చేస్తేనే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…