Mint Leaves : చాలా మంది పుదీనాని వంటల్లో వాడుతూ ఉంటారు. పుదీనా వల్ల చక్కటి లాభాలు కలుగుతాయి. పుదీనా ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అందుకే పురాతన కాలం నుండి కూడా ఈ మొక్కని అనేక చికిత్సల కోసం వాడుతున్నారు. పుదీనా ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి తోపాటుగా బి కాంప్లెక్స్ విటమిన్లు, ఇలా పోషకాలు చాలా ఉన్నాయి. పుదీనా ద్వారా ఐరన్, పొటాషియం, మాంగనీస్ ని కూడా మనం పొందవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ ని పెంచి మెదడు పనితీరుని మెరుగుపరచడానికి కూడా పుదీనా మనకి ఉపయోగపడుతుంది.
పుదీనాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. తక్కువ మొత్తంలో ప్రోటీన్, కొవ్వు కలిగి ఉంటుంది పుదీనా. పుదీనాని తీసుకోవడం వలన మనం బరువు కూడా తగ్గవచ్చు. ఉదయాన్నే పరగడుపున రెండు లేదా మూడు పుదీనా ఆకుల్ని తీసుకుంటే చక్కటి లాభాలను పొందవచ్చు. మరి ఎలాంటి లాభాలని పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే పరగడుపున పుదీనాని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు.
జీర్ణవ్యవస్థలోని కండరాలని ఇది సడలిస్తుంది. పుదీనాని తీసుకోవడం వలన శ్వాస సంబంధిత సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు. ఆస్తమాతో బాధపడే వాళ్ళకి చక్కటి ఉపశమనాన్ని అందిస్తుంది. పుదీనాను తీసుకోవడం వలన నోటి శుభ్రత ఉంటుంది. పుదీనా ఆకుల రసం దంతాల నుండి ఫలకాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది.
బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా నోటిని శుభ్రంగా ఉంచుతుంది. పుదీనాతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. పుదీనా టీ చేసుకుని తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు. పుదీనాని తీసుకుంటే మార్నింగ్ సిక్‌నెస్ నుండి కూడా బయటపడవచ్చు. ఇలా అనేక లాభాలు పుదీనా ద్వారా మనం పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…