Knee And Joint Pains : ఒకప్పుడంటే వయస్సు మీద పడడం కారణంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వచ్చేవి. కానీ నేటి తరుణంలో యుక్త వయస్సు వారికి కూడా అప్పుడప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏమున్నా మోకాళ్ల నొప్పులు వచ్చాయంటే చాలు కొంచెం దూరం నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికీ వెళ్లలేరు. ఏ పనీ చేయలేరు. దీంతో మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అయితే కింద ఇచ్చిన పలు చిట్కాలను పాటిస్తే మోకాళ్లు, కీళ్ల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ ముక్కలను ఒక సంచిలో వేసి కట్టాలి. ఆ సంచిని మళ్లీ ఓ పొడిగుడ్డలో చుట్టాలి. దాన్ని సమస్య ఉన్న ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ 2, 3 సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని దాన్ని మరిగించి అందులో ఒక టీస్పూన్ కర్పూరం పొడిని వేసి బాగా కలియబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమం చల్లారేదాకా ఉండాలి. దాన్ని తీసుకుని సమస్య ఉన్న ప్రదేశంలో మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి. కొంత వాము తీసుకుని దాన్ని నీటి సహాయంతో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి. తరచూ ఇలా చేస్తుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కొద్దిగా ఆముదం నూనెను తీసుకుని వేడి చేయాలి. ఆ వేడి నూనెను మోకాళ్లపై రాయాలి. అనంతరం వేడి నీటితో కాపడం పెట్టాలి. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇలా రోజుకు 2, 3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. కొంత పసుపును తీసుకుని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. అనంతరం దాన్ని మోకాళ్లపై మర్దనా చేసినట్టు రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఒక టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ చక్కెర పౌడర్, 1 టీస్పూన్ లైమ్ పౌడర్‌లను తీసుకుని వాటిని తగినంత నీటితో బాగా కలపాలి. దీంతో మెత్తని, చిక్కని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను రాత్రి పూట సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే వదిలేయాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పులు తగ్గిపోతాయి.
ఒక టీస్పూన్ అల్లం పొడి, 1 టీస్పూన్ ఆవ నూనెలను తీసుకుని బాగా కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మోకాళ్లపై రాసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం కడిగేసుకోవాలి. దీంతో కూడా ఆయా నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఐదు, ఆరు బాదం పప్పు పలుకులు, అంతే సంఖ్యలో నల్ల మిరియాలు, 10 రైజిన్స్ తీసుకోవాలి. వాటిని బాగా నములుతూ తినాలి. అనంతరం వేడిగా పాలు తాగాలి. రోజూ ఇలా చేయాలి. దీంతో నొప్పులను ఎఫెక్టివ్‌గా తగ్గించుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…