సాధారణంగా చాలామంది నెయ్యి లేనిదే భోజనం చేయరు. ఈ క్రమంలోనే మరికొందరు నెయ్యితో భోజనం చేయడానికి ఆలోచిస్తారు. నెయ్యిలో అధిక మొత్తం కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల నెయ్యి తింటే శరీర బరువు పెరిగిపోతారని భావించి నెయ్యిని దూరం పెడుతున్నారు. ఈ భావనలో ఉండి నెయ్యిని దూరం పెడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.మరి మన ఇంట్లో తయారు చేసుకునే సహజసిద్ధమైన నెయ్యిని తినడం ద్వారా ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక్కడ తెలుసుకుందాం.
నెయ్యిలో సహజసిద్ధమైన కొవ్వులు, పోషకాలు మన శరీరంలో కణజాల అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరంలోని వివిధ జీవ క్రియలను వేగవంతం చేస్తుంది. అయితే మోతాదుకు మించి నెయ్యి ఉపయోగించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అధిక మొత్తంలో నెయ్యి తినడం వల్ల అతిసారం, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం,జీవక్రియ రేటు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి కనుక ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా తగిన పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం.
సాధారణంగా మనం తయారు చేసే వంటకాలలో నెయ్యిని ఉపయోగించడం వల్ల మన శరీరానికి రోజు నెయ్యి అందుతుంది. అయితే చిన్నపిల్లలలో వారికి మరింత పోషణ అవసరం కనుక చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరికాస్త నెయ్యి జోడించాలి.ఏడు నెలల చిన్నారులకు పెట్టే ఘన ఆహార పదార్థాలలో రోజుకు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి తినిపించాలి.అదేవిధంగా సంవత్సరం వయసు ఉన్న పిల్లలలో ప్రతిరోజు అర టీ స్పూను నెయ్యి వేసి తినిపించడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…