ప్రతి తల్లి, తండ్రి కూడా వాళ్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని.. ఆనందంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు తీసుకునే ఆహారం బాగుండాలి. మంచి ఆహారం, పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు కచ్చితంగా బాధ్యత వహించాలి. మంచి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వాలి.
సరైన ఆహారం పిల్లలు తీసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. పైగా ఎదిగే పిల్లలకి బలం చాలా ముఖ్యం. అందుకనే ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు వంటివి అసలు పెట్టకండి. వీటి వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా బలం ఏమీ రాదు.
పిల్లలకి మొలకలు, నానబెట్టిన పల్లీలు వంటివి వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇవ్వండి. పచ్చి కొబ్బరిని రోజు విడిచి రోజు అయినా పిల్లలకి తినిపించాలి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటివి పిల్లలకి పెడుతూ ఉండండి. నువ్వులను బెల్లంతో కలిపి ఉండలు చేసి రోజు ఒకటి ఇవ్వండి. అప్పుడు ఎముకలు దృఢంగా ఉంటాయి. మునగాకు జ్యూస్ చేసి పిల్లలకి పాలతో పాటుగా ఇవ్వండి.
పిల్లలకి పంచదారని అస్సలు పెట్టొద్దు. పంచదారకి బదులుగా తాటి బెల్లం పెట్టొచ్చు. పిల్లలకి క్యాల్షియం అందడానికి రాగులని ఇవ్వండి. రాగులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ పెట్టండి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి కూడా పిల్లలు రోజూ తినేటట్టు చూడండి. వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలని కూడా పెట్టండి. వీటిని కనుక మీరు రెగ్యులర్ గా పాటించారంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇటువంటివి మీరు వారి డైట్ లో ఇచ్చారంటే, ఇక వారి ఆరోగ్యం గురించి మీరు ఆలోచించక్కర్లేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…