Kidneys : ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు చాలా మందిని బాధపెడుతున్నాయి. కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే కచ్చితంగా ఆరోగ్య నిపుణులని కన్సల్ట్ చేయాలి. ఈరోజూల్లో తీసుకునే ఆహారం, జీవన విధానం మారిపోవడం వలన చిన్న వయసు వారిలోనే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. కిడ్నీల పనితీరులో ఏదైనా సమస్య వస్తే, అది మొత్తం శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ పాడవ్వడం ప్రాణానికే ప్రమాదం. అందుకే కిడ్నీ వ్యాధి లక్షణాలని ఎప్పటికప్పుడు గుర్తించాలి. కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు..?, కిడ్నీలని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చు వంటి విషయాలని కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఉదయం పూట వికారంగా ఉండటం, వాంతులు రావడం వంటివి జరిగితే అవి కిడ్నీ సమస్య అని గుర్తించాలి. నురగతో కూడిన మూత్రం రావడం, మూత్రంలో రక్తం రావడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు లక్షణాలు.
వెన్నునొప్పి, పొత్తి కడుపునొప్పి తీవ్రంగా వస్తే కూడా అది కిడ్నీ సమస్య అని గుర్తు పెట్టుకోవాలి. కళ్ళు చుట్టూ వాపులు రావడం కూడా కిడ్నీ సమస్యకి లక్షణమే. ఒకసారి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే ఆరోగ్యం మొత్తం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి బాగుండాలి. అలానే మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి.
పసుపు, గుమ్మడి గింజలు, బెర్రీస్, అల్లం, పెరుగు, కొత్తిమీర తీసుకుంటూ ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గ్లాసులు మంచినీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. అలానే ఆపిల్స్, ఓట్స్, ఉల్లిపాయలు కూడా తీసుకుంటూ ఉండండి. కిడ్నీలకి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండండి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…