ఆరోగ్యం

Corn Flakes : సూప‌ర్ మార్కెట్‌ల‌లో ల‌భించే వీటిని తిన‌డం మంచిదేనా.. ఏదైనా హాని జ‌రుగుతుందా..?

Corn Flakes : నేడు మనం గడుపుతున్నది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి పనిని మనం వేగంగానే పూర్తి చేస్తాం. త్వర త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటాం. ఇక ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతే. చాలా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకుంటే.. వేగంగా తిని.. వెంటనే పనిలోకి దిగవచ్చు కదా.. అని చాలా మంది భావిస్తారు. అలాంటి వారు వేగంగా ప్రిపేర్ అయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లనే రోజూ తింటుంటారు. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లలో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటి.

కార్న్‌ఫ్లేక్స్ కొన్ని తీసుకుని వాటిల్లో కొన్ని పాలు పోసి ఉదయాన్నే లాగించడం చాలా మందికి అలవాటు. ఇక కొందరు ఈ మిశ్రమంలో పాలతోపాటు తేనె, చక్కెర లాంటి పదార్థాలను రుచి కోసం కలుపుకుంటారు. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి మంచివేనా..? అంటే కాదు.. అనే సమాధానం వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. కార్న్ ఫ్లేక్స్ మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావు. అది ఎందుకో తెలుసుకోండి.

Corn Flakes

కార్న్ ఫ్లేక్స్‌లో కార్న్ (మొక్కజొన్న), షుగర్, మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తదితర పదార్థాలుంటాయి. నిజానికి ఇవన్నీ హై గ్లైసీమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. అంటే.. ఇవి మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయన్నమాట. దీంతో ఇన్సులిన్ పెద్ద ఎత్తున విడుదలవుతుంది. అందువల్ల మెదడు కొంత సేపు ఇనాక్టివ్ అయిపోతుంది. చురుగ్గా ఉండలేరు. దీనికి తోడు కార్న్ ఫ్లేక్స్‌ను తినడం డయాబెటిస్ పేషెంట్లకు ఎంత మాత్రం మంచిది కాదు. రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి.

ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోతాయి. కార్న్ ఫ్లేక్స్ తయారీలో వాడే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మన శరీరానికి మంచిది కాదు. అందులో సాధారణ పిండిపదార్థాలు ఉంటాయి. కెమికల్ స్వీట్ ఫ్లేవర్డ్ ఎసెన్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక బరువు సమస్యను తెచ్చి పెడతాయి. దీనికి తోడు దంత క్షయం, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక కార్న్‌ఫ్లేక్స్‌ను తినకపోవడమే మంచిది. ఈ విషయాన్ని సాక్షాత్తూ వైద్య నిపుణులే చెబుతున్నారు. క‌నుక కార్న్ ఫ్లేక్స్‌ను తింటున్న వారు ఇక‌నైనా వాటి జోలికి వెళ్ల‌కండి. లేదంటే రోగాల‌ను కొని తెచ్చుకున్న వారు అవుతారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM