కల్తీ జరిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, ఆరోగ్యం పాడవుతుంది. తీసుకునే ఆహార పదార్థాలు, మంచివో కాదు చూసుకోవాలి. కల్తీ జరిగిందా లేదా అనేది తెలుసుకుని, ఆ తర్వాత మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈరోజుల్లో చాలా ఆహార పదార్థాలని రకరకాలుగా కల్తీ చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే, ఆరోగ్యానికి తేనె మంచిదని చాలామంది రెగ్యులర్ గా తేనెను తీసుకుంటారు. తేనె, నిమ్మరసాన్ని ఉదయం పరగడుపున తాగుతుంటారు. నిజానికి తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తోనే పోరాడుతుంది.
తేనె, నిమ్మరసం నీళ్లు కలిపి తాగితే, ఉదర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అయితే, సహజమైన తేనె తీసుకుంటే, ఎటువంటి లాభాలని పొందవచ్చు. కానీ, కల్తీ తేనెను తీసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప ప్రయోజనాలు వుండవు. స్వచ్ఛమైన తేనె అని, ధర ఎక్కువ పెట్టేసి, కల్తీ చేస్తున్నారు. చెరుకు, వరి, మొక్కజొన్న, గోధుమలు, బీట్రూట్ నుండి షుగర్ సిరప్ ని తయారు చేసి, తేనెలో మిక్స్ చేస్తున్నారు.
అడవి తేనె పేరుతో రోడ్డుపై ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు. చాలామంది తేనె అని బెల్లం పాకాన్ని కూడా ఇస్తూ ఉంటారు. కల్తీ దాన్ని తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కలగవు. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి…? నకిలీ తేనె ని ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే, వాటర్ డిసోల్యూషన్ టెస్ట్ బాగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేయండి.
ఆ తేనె కనుక సులభంగా కరిగిపోయినట్లయితే, అది కల్తీ తేనె అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. గ్లాసు అడుగుకు వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి, పేపర్ టవల్ టెస్ట్ కూడా పని చేస్తుంది. పేపర్ టవల్ షీట్ తేనెను పీల్చుకోలేదు. ఒకవేళ కనుక త్వరగా పీల్చుకుంటే, అది నకిలీ తేనె అని గుర్తించాలి. హీట్ టెస్ట్ కూడా బాగా పనిచేస్తుంది. తేనెను వేడి చేయండి. స్వచ్ఛమైన తేనె కారామెలైజ్ అవుతుంది. బంగారం రంగులోకి వస్తుంది. మంచి వాసన కూడా వస్తుంది. తేనె కాలిపోయి, కాలిన వాసన వస్తే అది నకిలీ తేనె అని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…