Hair Growth : వయసుతో సంబంధం లేకుండా నేటి తరుణంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, తలలో దురద, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు తెగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు సమస్యలు తలెత్తడానికి వివిధ కారణాలు ఉన్నాయి. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, జుట్టుకు పోషకాలు సరిగ్గా అందకపోవడం, రసాయనాలు కలిగిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడం వంటి వివిధ కారణాల చేత జుట్టు సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా ఒక చక్కటి చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు.
ఈ చిట్కాను తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలను మాత్రమే ఈ చిట్కా తయారీకి ఉపయోగించాల్సి ఉంటుంది. జుట్టు సమస్యలను దూరం చేసే ఈ చిట్కా ఏమిటి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం మెంతులను, పెరుగును, నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. ముఖ్యంగా తల చర్మానికి అంటేలా బాగా పట్టించాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. చుండ్రు సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. తల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం చక్కటి అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…