ఆరోగ్యం

Constipation : ఇన్ని రోజులూ మీరు టాయిలెట్‌లో త‌ప్పుగా కూర్చుంటున్నార‌ని తెలుసా..?

Constipation : శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటికి పంపివేయాలి. లేదంటే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వ్యర్థాల్లో ప్రధానంగా చెప్పుకోదగినది మలం. మనలో అధిక శాతం మంది మలబద్దకంతోనో లేదా ఇతర కారణాలతోనే నిత్యం విరేచనం సరిగా చేయరు. దీంతో వివిధ జబ్బులకు గురి కావల్సి వస్తుంది. మనం సాధారణంగా రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతో ముగిస్తాం. అయితే రోజుకు 2 సార్లు తప్పనిసరిగా మల విసర్జన చేయాల్సిందే. అధిక శాతం వరకు 3 సార్లు ఎవరూ వెళ్లరు. 2 సార్లు వెళ్లే వారు కూడా చాలా తక్కువగానే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మల విసర్జన సాఫీగా జరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెస్టర్న్ తరహా మరుగుదొడ్లకు వెళ్లేవారు 90 డిగ్రీల కోణంలో సాధారణంగా కూర్చుంటారు. అయితే ఇది చాలా తప్పు. ఎందుకంటే మల విసర్జన సరిగా జరిగేందుకు ఇది ఏమాత్రం దోహదం చేయదు. ఆ తరహా మరుగుదొడ్డి ఉన్నా సరే బేసిన్‌పై 35 డిగ్రీల కోణం వచ్చేలా కూర్చోవాలి. దీంతో మల విసర్జన సాఫీగా జరుగుతుంది.

Constipation

2. పీచు (ఫైబర్) ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రధానంగా బ్రకోలి, కాలిఫ్లవర్, క్యాబేజీ, ఆకుపచ్చని కూరగాయలు, యాపిల్స్, క్యారెట్లు, బెర్రీలు, నారింజ, నిమ్మ వంటి వాటితోపాటు సల్ఫర్ ఉండే గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు సరాసరిగా ఒక వ్యక్తి దాదాపు 15 గ్రాముల ఫైబర్ ఉన్న ఆహార పదార్థాన్ని తింటాడు. అయితే మనకు కనీసం 25 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది. ఎక్కువగా మలబద్దకంతో బాధపడే వారు ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఈ క్రమంలోనే వారికి గోధుమ పిండితో చేసిన రొట్టెలు, గోధుమ బ్రెడ్, నట్స్, ఆకుపచ్చని కూరగాయలు వంటివి మేలు చేస్తాయి.

3. టాయిలెట్ సీట్‌పై కూర్చునే విధానంలో కూడా మల విసర్జన సాఫీగా జరగడం ఆధారపడి ఉంటుంది. సీట్‌పై గుంజీలు తీసినట్టు కూర్చోవాలి. అప్పుడే సరైన భంగిమ ఏర్పడి విరేచనం సులువుగా అవుతుంది.

4. నీటిని ఎక్కువగా తాగాలి. తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఫలితంగా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. అందుకే నీరు ఎక్కువగా తాగితే విరేచనం కూడా సాఫీగా జరుగుతుంది.

5. కాఫీ తాగితే సులువుగా విరేచనం జరుగుతుందట. సో, రోజుకో కప్పు కాఫీ తాగితే మలబద్దకం సమస్య కూడా ఉండదు.

6. నడకతో కూడా మల విసర్జన సాఫీగా జరిగేలా చేసుకోవచ్చు. ఎంత ఎక్కువగా నడిస్తే అంత సులువుగా విరేచనం జరిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కూర్చోవడం మాని ఎక్కువగా నడవండి.

7. పొట్టను సున్నితంగా మసాజ్ చేసినా విరేచనం సులువుగా జరుగుతుంది. ఇక ముందెప్పుడైనా విరేచనం సమస్యగా ఉంటే ఈ ట్రిక్‌ను ఫాలో అయి చూడండి. ఫలితం కనిపిస్తుంది.

8. ప్రూన్స్ అనే ఓ రకమైన పండ్లలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మల విసర్జన సాఫీగా, సులువుగా జరిగేలా చేస్తాయి. ఈ పండ్ల జ్యూస్‌ను తాగినా ఫలితం ఉంటుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM