ఆరోగ్యం

Diabetes : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. షుగ‌ర్ ఎంత ఉన్నా స‌రే మొత్తం త‌గ్గుతుంది..!

Diabetes : డ‌యాబెటిస్‌.. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భ‌య‌పెడుతున్న జ‌బ్బు ఇది. దీని బారిన ఏటా మ‌న దేశంలో కొన్ని కోట్ల మంది ప‌డుతున్నారు. టైప్‌-1, టైప్‌-2 ఏదైనా రెండింటి వ‌ల్ల ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండింటికీ ట్రీట్‌మెంట్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. టైప్‌-1 కు ఇంజెక్ష‌న్లు ఇస్తే, టైప్‌-2కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్ర‌మంలో ఏ త‌ర‌హా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్ గ‌ణ‌నీయంగా అదుపులోకి వ‌స్తుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన చెక్క‌కు ర‌క్తంలోని చ‌క్కెర‌ను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ త‌ర‌హా ఔష‌ధ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్క‌ను ఎలా వాడాలంటే.. దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మ‌రిగాక వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందు తాగాలి. దీంతో కేవ‌లం కొద్ది రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది. టైప్‌-1 డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా న‌యం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. ఇందుకు గాను 2010లో జ‌రిపిన ప‌లు అధ్య‌య‌నాలు కూడా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టైప్‌-1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.

Diabetes

వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ ర‌క‌మైన ర‌సాయ‌నం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది టైప్‌-2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మంచిది. ఇది వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల్ని అలాగే ప‌చ్చిగా తింటుంటే దాంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు క‌రివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔష‌ధ కార‌కాలు డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందుగా గుప్పెడు క‌రివేపాకు ఆకుల‌ను తింటే దాంతో చ‌క్కెర వ్యాధి న‌యం అవుతుంది.

జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీల‌కర్ర పొడి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఆ నీటిని మ‌రిగించాలి. అలా నీరు అర‌గ్లాస్ అయ్యాక స్టవ్ ఆర్పి ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగ‌ర్ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు.

మీఠీ ప‌త్తి అని పిల‌వ‌బ‌డే ఓ మొక్క ఆకులు కూడా బ్ల‌డ్ షుగ‌ర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని స‌హ‌జ సిద్ధ‌మైన తీపి ప‌దార్థంగా షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు వాడుకోవ‌చ్చు కూడా. దీంతో షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు స‌రి క‌దా, పైగా ఎక్కువ‌గా ఉన్న గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌లోకి వ‌స్తాయి. దీన్ని 2011లో ప‌లు అధ్య‌య‌నాలు నిరూపించాయి కూడా. ఈ మొక్క‌కు చెందిన పొడి కూడా మ‌న‌కు మార్కెట్‌లో ల‌భ్య‌మ‌వుతోంది. బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తింటున్నా షుగ‌ర్ వ్యాధిని అదుపులోకి తేవ‌చ్చు. పొడ‌ప‌త్రి ఆకు చూర్ణం నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర గంట ముందు నీళ్ల‌లో క‌లిపి తాగాలి. దీని వ‌ల్ల కూడా షుగ‌ర్ గ‌ణ‌నీయంగా అదుపులోకి వ‌స్తుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM