Eye Sight : పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు, పైకి కిందకి, కిందకి పైకి తిప్పాలి. అలా రోజుకు కనీసం 4 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీంతో కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర సమస్యలు పోతాయి. మామిడి పండ్లు, చేపలు, క్యారెట్లు, యాపిల్స్, ఆప్రికాట్స్ వంటి విటమిన్ ఎ ఉన్న ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తినాలి. దీంతో ఎ విటమిన్ బాగా అందుతుంది. అప్పుడు దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. అద్దాలు వాడాల్సిన పనే ఉండదు.
నోట్లో కొంత నీరు నింపుకుని నోటిని అలాగే మూసి ఉంచాలి. అనంతరం చల్లని నీటితో కళ్లను కడగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం ఇలా చేయాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. ఆవ నూనె లేదా నెయ్యితో పాదాలను తరచూ మర్దనా చేసుకున్నా దృష్టి సమస్యలు పోతాయి. కళ్లు చక్కగా కనిపిస్తాయి. నేత్ర దోషాలు హరించుకుపోతాయి. రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకుని అందులో మిరియాల పొడి కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నేత్ర సమస్యలు పోయి కళ్లు చక్కగా కనిపిస్తాయి.
రోజూ ఉదయం, సాయంత్రం 20 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ రసం సేవించాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు దండిగా లభిస్తాయి. అవి నేత్ర దోషాలు పోగొడతాయి. దృష్టి బాగా వచ్చేలా చేస్తాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…