India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

Mistakes : దంపతులు పడుకోవడానికి ముందు ఈ 11 తప్పులు చేయకండి..!

IDL Desk by IDL Desk
Wednesday, 8 March 2023, 8:38 AM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Mistakes : మనుషుల బిజీ బిజీ జీవితాల్లో ఒకర్నొకరు పట్టించుకోవడానికి కొంచెం టైం కూడా దొరకట్లేదు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం.. పగలంతా ఆఫీసులో పని ఒత్తిడి, రాత్రి కాగానే రెస్ట్ తీసుకోవాలనే ఆత్రుత. కొందరి పరిస్థితి మరీ ఘోరం. ఇంటికొచ్చాక కూడా ఆఫీస్ పనే. ఇంకొందరు దంపతులైతే ఒకరిది పగలు ఉద్యోగం అయితే, మరొకరిది నైట్ షిప్ట్ ఉంటోంది. ఇక వారు కలిసి మాట్లాడుకొవడానికి ఛాన్స్ ఎక్కడిది. కానీ దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యానికి మనసు విప్పి మాట్లాడుకొవడమే పరిష్కారం. దానితో పాటు కొన్ని తప్పులు చేయకుండా ఉంటే చాలు.. దీంతో దాంప‌త్యం అన్యోన్యంగా ఉంటుంది. ఇక ఆ త‌ప్పులు ఏమిట‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్స్.. ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు మొబైల్స్ చూడడం.. చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకోవడం. సోషల్ మీడియా డిపెండెన్సీ మీ శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలను అణిచివేస్తుంది. ఈ హార్మోన్ భావోద్వేగానికి, సాన్నిహిత్యానికి, బంధం బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇకపై త్వరగా నిద్రకు ఉపక్రమించి పడుకోవడానికి ముందు మొబైల్స్ ఆఫ్ మోడ్ లో పెట్టి పడుకోండి. సోషల్ మీడియా వలన, స్మార్ట్ ఫోన్స్ వలన చాలామంది దంపతుల బంధాల‌ బీటలు వార‌డం మ‌నం చాలానే చూస్తున్నాం. క‌నుక ఫోన్ వాడ‌కాన్ని త‌గ్గించాలి. రాత్రి నిద్రించేట‌ప్పుడు అయితే అస‌లు వాడ‌రాదు.

do not make these mistakes before sleep
Mistakes

ఒకసారి నిద్రకు ఉపక్రమించాక పని గురించి మర్చిపోండి. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడానికి ప్రయత్నించండి. దానివలన మీ మనసు ప్రశాంతంగా ఉండి, హాయిగా నిద్రపట్టి తర్వాత రోజు ఆఫీసు పని చేసుకోవడానికి మీ మనసు, మెదడు హెల్ప్ చేస్తాయి. కాబట్టి పడుకునే ముందు, నిద్రలేవగానే ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకోవడానికి ఫోన్లో తలపెట్టకండి. మీ జీవిత భాగ‌స్వామితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించండి. దంపతులిద్దరూ ఒకేసారి పడుకోవడానికి ట్రై చేయండి. భార్య పడుకోవడానికి వచ్చినప్పుడు భర్త తన పనిలో ఉండడం, లేదంటే భర్త పడుకున్నప్పుడు భార్య ఇంకా కిచెన్లో తన పని చేస్కుంటూ ఉండడం కరెక్ట్ కాదు. ఇద్దరూ సేమ్ టైం కి పడుకోవడం అనేది అలవాటు చేసుకోండి.

నైట్ టైం పడుకోవడానికి ముందు ఇద్దరూ కలిసి చేసే పనులు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. కలిసి భోజ‌నం చేయడం, కలిసి టీవి చూడ్డం. ఇలా చేసే ఏ పనైనా ఇద్దరూ కలిసి చేయడం మంచిది.
ఒకరి ఫీలింగ్స్ ని మరొకరు గౌరవించుకోవాలి. ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినాలి. దాని వలన వారి పట్ల మనం ఎంత ప్రేమ, కేర్ చూపిస్తున్నామో ఎదుటివారికి అర్దం అవుతుంది. ఒకసారి బెడ్రూంలోకి అడుగుపెట్టాక ఇతరత్రా సమస్యలను అన్నింటినీ బెడ్రూం బయటే వదిలేయండి. భార్యా భర్తల మధ్య మనస్పర్థ‌లు వచ్చినా వాటిని బెడ్రూం వరకు తీసుకురాకపోవడమే మంచిది. గొడవ పడే అంశాలున్నా పడుకోవడానికి ముందు వాటిని చర్చించకపోవడమే మంచిది. ఆ విషయాలన్ని మర్చిపోయి కూల్ గా ఉన్నట్టయితే మరుసటి రోజుకి ఆ గొడవ ప్రభావం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.

సాధారణంగా పిల్లలు పుట్టాక దంపతుల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది. కానీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటే దాన్ని అధిగమించొచ్చు. పిల్లల్ని ఒక ఏజ్ వచ్చాక వారికంటూ ఒక రూం ఏర్పాటు చేసి వేరుగా పడుకునే విధంగా అలవాటు చేయాలి. దానివల్ల మీకు ప్రైవసీతోపాటు పిల్లల్ని కూడా స్వతంత్రంగా పడుకోవడం అలవాటు చేసినవారవుతారు. పరిశోధనలప్రకారం పెంపుడు జంతువులతో నిద్రించేవారిలో 63 శాతం మందికి సరైన నిద్ర ఉండట్లేదు అని తేలింది. పెంపుడు జంతువుల్ని పక్కనే పడుకోబెట్టుకోవడం వలన మీ నిద్ర డిస్టర్బ్ చేయడం వలన.. ఆ డిస్టర్బెన్స్ దంపతుల మధ్య కూడా ఉంటుంది.

చాలా మంది జంటలు ఒక శృంగార వాతావరణాన్ని సృష్టించుకోవడానికి పడుకోవడానికి వెళ్ళే ముందు ఆల్కహాల్ తీసుకుంటారు. లేదంటే పడుకునే ముందు సిగరెట్ తాగుతారు .కానీ అది మంచిది కాదు, దానివల్ల మీకు నిద్ర సరిగా ఉండక ఉదయాన్నే నిద్రలేచాక అలసటతో, పరధ్యానంలో, సులభంగా కోపం వచ్చేస్తుంటుంది. దాంతోపాటు భాగస్వామికి ఆల్కహాల్, సిగరెట్ల పట్ల అయిష్టత కూడా ఉండొచ్చు. కాబట్టి ఆల్కహాల్, సిగరెట్ కి దూరంగా ఉండడమే మంచిది. నిద్రపోవడానికి ముందు జంటలు ఒకరికొకరు మసాజ్ చేసుకోవడం వలన బంధం బలపడుతుంది. దాని వలన ఆందోళ‌న, ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పట్టడానికి దోహదపడుతుంది.

చాలామంది పడక గ‌దికి రాగానే ఏదో కలిసామా, పడుకున్నామా అన్నట్టుగా పనైంది అనిపిస్తారు. కానీ పడుకోవడానికి ముందు భాగస్వామికి ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటి చిన్న చిన్న పనులే ఒకరితో ఒకర్ని మరింత దగ్గర చేస్తాయి. ఇలా రోజూ చేస్తుంటే దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి క‌ల‌హాలు లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది.

Tags: couplemistakessleep
Previous Post

Nail Biting : చాలా మంది గోర్ల‌ను ఎందుకు కొరుకుతారు.. దీని వెనుక ఉన్న కార‌ణాలేంటి..?

Next Post

Foods : ప‌థ్యం స‌మ‌యంలో ఎలాంటి ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడ‌దు.. తెలుసా..?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
జ్యోతిష్యం & వాస్తు

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

by IDL Desk
Sunday, 21 May 2023, 7:49 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.