ఆరోగ్యం

Meals : భోజనం చేశాక ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌ని ప‌నులు..!

Meals : భార‌త‌దేశం ఆయుర్వేద శాస్త్రానికి పుట్టినిల్లు. శాస్త్ర‌సాంకేతికత అభివృద్ది చెంద‌ని స‌మ‌యంలోనే అనేక రోగాలకు చికిత్సలు, ముందు జాగ్రత్తలు సూచించిన విజ్ఞాన సర్వస్వం ఆయుర్వేదం. పెరట్లోని మొక్కలు చేసే మహాద్బుతాలను తెలియజెప్పింది ఆయుర్వేద శాస్త్రం. అలాంటి ఆయుర్వేద శాస్త్రం భోజ‌నం చేశాక కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని బల్ల గుద్ది చెబుతోంది. అలా చేస్తే ఆరోగ్యం క్షీణించ‌డ‌మే కాదు శ‌రీరానికి ప్ర‌మాదం అని కూడా హెచ్చ‌రిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిల్లో పండ్లు తిన‌కూడ‌దు. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే పండ్లు తిన్న‌ట్ల‌యితే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాదు. క‌డుపు మొత్తం గాలితో నిండిపోతుంది. దీంతో అజీర్తి క‌లిగే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ బారిన ప‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. ఒక వేళ త‌ప్పని స‌రిగా పండ్లు తినే అల‌వాటు ఉంటే మాత్రం గంట ముందు లేదా గంట త‌రువాత తీసుకుంటే మంచిది. అన్నం తిన్న త‌రువాత టీ తాగ‌రాదు. భార‌త దేశంలో ఎక్కువ మంది ఈ త‌ప్పును చేస్తున్నారు. అన్నం తిన్న వెంట‌నే టీ తాగడం వ‌ల‌న పెద్ద మొత్తంలో యాసిడ్ విడుద‌ల‌వుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గించి ఆల‌స్యంగా ఆహారం జీర్ణం అవుతుంది.

Meals

తిన్న త‌రువాత వెంట‌నే న‌డ‌వ‌కూడ‌దు. తిన్న త‌రువాత వెంట‌నే న‌డిస్తే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో పెద్ద మొత్తంలో యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. దీంతో క‌డుపులో మంట ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అందుక‌ని తిన్న త‌రువాత కాసేపు విశ్రాంతి తీసుకుని 30 నిమిషాల త‌రువాత న‌డ‌క ప్రారంభించాలి. తిన్న వెంట‌నే బెల్టు లూస్ చేసుకోకూడదు. చాలా మంది అతిగా తిన్నామ‌న్న ఉద్దేశ్యంతో బెల్ట్ ను కాస్త లూస్ చేస్తారు. అలా చేయ‌కూడదు.. దీని వ‌ల్ల ఎక్కడైనా ఆగిపోయిన ఆహారం కింది రాదు. సరిగ్గా జీర్ణం కాదు. ఎట్టి ప‌రిస్థితిలో తిన్నాక‌ స్నానం చేయకూడదు. ఉద‌యం అయినా సాయంత్రం అయినా భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్ధ సామర్థ్యం తగ్గిపోతుంది.

అన్నం తిన్న వెంట‌నే నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెెంటనే నిద్ర‌లోకి జారుకుంటే ఇబ్బందే. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు, ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక 10 నిమిషాలు పడుకొని లేవటం మంచిది. అలాగే నిద్ర‌ను కొన‌సాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది త‌ప్ప‌దు. భోజ‌నం చేశాక ఈత కొట్ట‌కూడ‌దు. తిన్న వెంట‌నే స్విమ్ చేయ‌డం ప్రమాదం అని చెబుతోంది ఆయుర్వేదం. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వేగం పెరిగి శ‌రీర కండ‌రాలు స్త‌బ్ధుగా మారుతాయ‌ని చెబుతోంది. జిమ్, వ్యాయ‌మం.. ఆట‌లు కూడా ఆడ‌కూడ‌దు.

భోజ‌నం చేశాక ధూమ‌పానం చేయ‌కూడ‌దు. ధూమ‌పానం ఎప్పుడు చేసిన ప్ర‌మాద‌మే కానీ తిన్న త‌రువాత ధూమ‌పానం అసలు చేయ‌కూడ‌దు. అలా చేయ‌డం వ‌ల్ల ఒకే సారి 10 సిగ‌రెట్లు తాగిన ఎఫెక్ట్ ను కాలేయానికి అందిస్తుందంట‌. దీంతో ఊపిరితిత్తుల‌పై భారం ఎక్కువ‌వుతుంద‌ని చెబుతోంది ఆయుర్వేదం. క‌నుక భోజ‌నం చేసిన వెంట‌నే ఈ త‌ప్పుల‌ను అస‌లు చేయ‌రాదు. లేదంటే ఇబ్బందులు ప‌డ‌తామ‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM