Diabetes Health Tips : నేటి తరుణంలో మనలో చాలా మందిని బాధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో షుగర్ వ్యాధి ఒకటి. షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే. అలాగే అనేక ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా వారు తీసుకునే పండ్ల గురించి అనేక అపోహలను కలిగి ఉంటారు. షుగర్ వ్యాధి గ్రస్తులు పండ్లను అసలు తీసుకోకూడదని కొందరు చెబుతూ ఉంటారు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఎటువంటి పండ్లను తీసుకోవాలి… అలాగే ఈ వేసవికాలంలో వారు తీసుకునే పండ్ల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి… దీని గురించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలను తీసుకోవాలి. అనగా నారింజ, ఆపిల్, జామకాయలు, బేరి పండ్లు, ద్రాక్ష పండ్లు, చెర్రీలు, బెర్రీ పండ్లు వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగకుండా ఉంటాయి. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పండ్లు అనగా సీతాఫలం, బొప్పాయి, పైనాఫిల్, సపోటా వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవికాలంలో మనకు ఎక్కువగా మామిడిపండ్లు, పుచ్చకాయలు లభిస్తూ ఉంటాయి. అయితే ఈ పండ్లు ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు మామిడిపండ్లను, పుచ్చకాయలను తక్కువగా తీసుకోవడం మంచిది.
ఇక షుగర్ వ్యాధి గ్రస్తులు తీసుకోవాల్సిన పండ్లల్లో అవకాడో ఒకటి. దీని యొక్క గ్లైసెమిక్స్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే చాలా మంది అరటిపండును ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల మబద్దకం సమస్య రాకుండా ఉంటుందని చాలా మంది దీనిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. అరటిపండులో ఫైబర్ ఉన్నప్పటికి దీని యొక్క గ్లెసెమిక్స్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు అరటిపండును తీసుకోకపోవడమే మంచిది. ఈ విధంగా మీ షుగర్ స్థాయిలను దృష్టిలో ఉంచుకుని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పండ్లను తీసుకోవడం చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…