ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల నిత్యం ఆరోగ్యవంతమైన జీవనం గడపవచ్చునని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.పాలు మనకు శక్తి నివ్వడమే కాకుండా,మన ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.పాలలో మన శరీర పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఎముకల పటుత్వాన్ని పెంచే విటమిన్ డి, క్యాల్షియం పాలలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పెరిగే పిల్లలకు తప్పనిసరిగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు పాలు తాగిస్తే శరీర పెరుగుదలతో పాటు మెదడు చురుకుగా పనిచేసి మానసికంగా అభివృద్ధి చెందుతారు.
అయితే చాలామంది పాలు తాగే విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా మన ఆరోగ్యానికి వేడి పాలు తాగితే మంచిదా..లేక చల్లటి పాలు తాగితే మంచిదా.. అన్న సందేహం చాలామందిలో వస్తుంటుంది. అయితే వైద్యుల సూచన ప్రకారం వేడి పాలు తాగిన,చల్లటి పాలు తాగిన సంపూర్ణ ఆరోగ్యానికి మంచిదే. అయితే పచ్చిపాలను మాత్రం తాగకూడదు. పాలను బాగా వేడి చేసి గోరు వెచ్చగా అయిన లేదా చల్లటి పాలైన తాగవచ్చు.
శీతాకాలం మరియు వర్షాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది.కావున వేడి పాలు తాగడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.అలాగే సుఖ ప్రదమైన నిద్ర కోసం గోరు వెచ్చని పాలు లేదా వేడి పాలు తీసుకోవడం మంచిది. చల్లటి పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కావున కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.అయితే రాత్రి నిద్రపోయే సమయంలో చల్లటి పాలు తాగే అలవాటు మానుకోవాలి. లేదంటే కొంతమందిలో జీర్ణ సమస్యలు, దగ్గు, రొంప వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాలను తీసుకోవడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…