Coconut Water : వేసవి వచ్చేసింది. ఇప్పటికే రోజూ మండిపోతున్న ఎండలకు జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో వేసవి తాపం చల్లారేందుకు వారు రక రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. అయితే ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది ఆశ్రయిస్తున్న ముఖ్యమైన ఒక మార్గం.. కొబ్బరినీళ్లు. వాటిని తాగితే చాలు వేసవి తాపం ఇట్టే పోతుంది. శరీరానికి కావల్సిన ద్రవాలు అందుతాయి. దాహం తీరుతుంది. అయితే కేవలం దాహం తీర్చేందుకే కాక పలు ఇతర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు కూడా కొబ్బరి నీళ్లలో ఉన్నాయి. వీటిని ఈ సీజన్‌లో రోజూ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లల్లో ప్రొటీన్లు, కొవ్వు, పిండిపదార్థాలు, డైటరీ ఫైబర్‌లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. అలాగే విటమిన్-సి, బి6, ఇ, కె, థయామిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి వేసవిలో మనకు కావల్సిన పోషకాలను అందిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరినీళ్లు ఎలక్ట్రోలైట్స్‌గా పనిచేస్తాయి. శరీరంలోని నీటి పరిమాణాన్ని సమతుల్యం చేస్తాయి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, నీళ్ల విరేచనాలను తగ్గించడంలో కొబ్బరి నీళ్లు అమోఘంగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లల్లో యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలుండడం వల్ల పలురకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
లేత కొబ్బరి బొండాంలోని నీళ్లు కలరాకు అడ్డుకట్ట వేస్తాయి. రెండు గ్లాసుల కొబ్బరినీళ్లల్లో నాలుగు టీస్పూన్ల నిమ్మరసం వేసి తాగితే ఎంతో మంచిది. ఈ మిశ్రమం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యమవుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొబ్బరినీళ్లు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కొబ్బరినీళ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి.
పోస్ట్ మెనోపాజల్ సింప్టమ్స్‌ను తగ్గించడంలో కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. గాయాల తీవ్రతను తగ్గిస్తాయి. గాయాలు త్వరగా మానేలా చేస్తాయి. బ్లడ్ షుగర్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడమేగాక రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగించే లక్షణాలు ఈ నీళ్లకు ఉంటాయి. కొబ్బరి నీళ్లు కొవ్వును కరిగించడమేగాక బరువును తగ్గిస్తాయి. కనుక ఈ నీళ్లను తరచూ తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…