Chia Seeds In Telugu : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చియా సీడ్స్ ని తీసుకోవడం వలన, ఎన్నో లాభాలు ని పొందవచ్చు. ఆరోగ్య నిపుణులు చియా సీడ్స్ వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. మరి, ఇక చియా సీడ్స్ వలన ఎలాంటి లాభాలను పొందవచ్చు అనే విషయాన్ని చూద్దాం.
బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఖచ్చితంగా చియా సీడ్స్ ని తీసుకుంటూ ఉంటారు. చియా సీడ్స్ ని తీసుకుంటే, ఈజీగా బరువు తగ్గొచ్చు. ఆరోగ్యాన్ని చియా సీడ్స్ పెంచుతాయి. ఈ సీడ్స్ లో పోషకాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

చియా సీడ్స్ ని మనం సలాడ్, స్మూతీ వంటి వాటిలో కూడా వేసుకోవచ్చు, నానబెట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ చియా సీడ్స్ ని తీసుకుంటే, అనేక లాభాలని పొందడానికి అవుతుంది. చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తొలగిస్తాయి. చియా సీడ్స్ లో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది.
వీటిని తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. పేగు కదలికలని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి అవుతుంది. చియా సీడ్స్ లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. 14% ప్రోటీన్ చియా సీడ్స్ లో ఉంటాయి. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చియా సీడ్స్ లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్, లినోలెనిక్ యాసిడ్ ఎక్కువ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇలా, అనేక లాభాలను మనం చియా సీడ్స్ తో పొందవచ్చు.