Candles : కొవ్వొత్తులని ఇంట్లో వెలిగించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీపావళి వంటి పండుగలప్పుడు కొవ్వొత్తులని చాలా మంది వెలిగిస్తూ ఉంటారు. అయితే కొవ్వొత్తులని ఎక్కువగా వెలిగించడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చాలా మంది ఇళ్లల్లో మంచి సువాసన వెదజల్లే కొవ్వొత్తులని వెలిగించుకుంటూ ఉంటారు. కరెంట్ పోయినప్పుడు కూడా చాలా మంది కొవ్వొత్తులని వెలిగిస్తూ ఉంటారు. అయితే కొవ్వొత్తిని వెలిగించడం వలన కొన్ని సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వొత్తి వలన ఊపిరితిత్తుల ఆరోగ్యం పాడవుతుంది. ధూమపానం, కాలుష్యం లాగానే కొవ్వొత్తి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఊపిరితిత్తులు కొవ్వొత్తుల కారణంగా నల్లబడిపోతాయి. ఇంట్లో వెలిగించే కొవ్వొత్తుల పొగ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అర్హస్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనం ద్వారా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

కొవ్వొత్తుల నుండి వచ్చే పొగ కారణంగా ఆస్తమా వాళ్ళకి ఇబ్బంది ఇంకా ఎక్కువ కలుగుతుందని తెలుస్తోంది. ఆస్తమాతో బాధపడే వాళ్ళు కొవ్వొత్తికి దూరంగా ఉండాలి. ఈ పొగ ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కొవ్వొత్తుల యొక్క పొగ డీఎన్ఏని దెబ్బతీస్తుంది. తేలికపాటి ఆస్తమాతో బాధపడే వాళ్ళు కొవ్వొత్తి పొగ వలన సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు అధ్యయనం చెబుతోంది.
ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉందని స్టడీ చెప్పింది. కొవ్వొత్తి పొగే కాదు. వంట పొగ కూడా ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని స్టడీ అంటోంది. ఆరోగ్యవంతుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పొగ పేరుకుపోతూ ఉంటుంది. ఆ పొగ వాసనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పొగ బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. లేదంటే కచ్చితంగా ఇబ్బంది పడాలని గుర్తుపెట్టుకోండి.