Cockroaches : ఇంట్లో బొద్దింకలు తిరుగుతుంటే.. యాక్.. వాటిని చూస్తేనే కొందరికి అదోలా అనిపిస్తుంది. అలాంటిది కిచెన్‌లో వంట పాత్రల దగ్గర అవి తచ్చాడితే ఇక ఆ పాత్రలను బాగా తోమి కానీ వాడకూడదు. ఇక బొద్దింకలు అనేవి ఇండ్లలోకి సహజంగానే వస్తుంటాయి. అయితే వాటిని తరిమేందుకు చాలా మంది కాక్‌రోచ్ కిల్లర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింకలు చనిపోయినప్పటికీ వాటిని కెమికల్స్‌తో తయారు చేస్తారు కనుక.. ఆ కిల్లర్స్ మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. కనుక బొద్దింకలను సహజసిద్ధమైన పద్ధతిలోనే వదిలించుకోవాలి. మరి అందుకు ఏం చేయాలంటే..
1. బొద్దింకలు సాధారణంగా పసుపు రంగుకు ఆకర్షితమవుతాయట. కనుక కిచెన్‌లో ఆ రంగు ఉండకుండా చూసుకోవాలి. పాత్రలు కానీ, కూరగాయలు కానీ, ఇతర వస్తువులు కానీ ఎల్లో కలర్ ఉన్నవి తీసేయాలి. దీంతో బొద్దింకలు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి.
2. దోసకాయ ముక్కల వాసన బొద్దింకలకు పడదు. కనుక కిచెన్‌లో వాటిని అక్కడక్కడా ఉంచితే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.
3. బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింకలు వచ్చే చోట చల్లితే.. బొద్దింకలు ఇన్‌ఫెక్షన్‌తో చనిపోతాయి.
4. సబ్బు నీళ్లను బొద్దింకలపై పోస్తే అవి వెంటనే చనిపోతాయి.
5. బోరిక్ పౌడర్, చక్కెర పొడి, మొక్కజొన్న పిండిలను సమాన భాగాలుగా తీసుకుని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచాలి. ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి.
6. కిచెన్‌లో వీలైనంత వరకు మనం తినే ఆహార పదార్థాలు కింద పడకుండా చూసుకోవాలి. లేదంటే.. బొద్దింకలు వచ్చేస్తాయి. అలాగే కిచెన్ లో పాత్రల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…