Ash Gourd Juice : చాలా మంది ఈ రోజుల్లో బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి మంచిదని తీసుకుంటున్నారు. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాల గురించి చాలా మందికి తెలియదు. గుమ్మడికాయలలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. విటమిన్ ఏ, బీ6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
బూడిద గుమ్మడికాయలని మనం సూప్స్, సలాడ్స్ లేదంటే కూర వంటివి చేసుకు తీసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయని తీసుకోవడం వలన గ్యాస్, మలబద్ధకం సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్ సమస్యలకి ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది.
కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. బూడిద గుమ్మడికాయను తీసుకోవడం వలన కిడ్నీ సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు. యాంటీ డయారియల్ ఏజెంట్ గా ఇది పని చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వాళ్లు కూడా దీనిని తీసుకుంటే మంచిది. ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణని కూడా పొందవచ్చు. గుండెకి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.
బూడిద గుమ్మడికాయని తీసుకుంటే, మెదడుకి కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బూడిద గుమ్మడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని, ఎలాంటి నీళ్లు వేసుకోకుండా జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసం, అల్లం, మనం చేసుకున్న ఏదైనా మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఉపయోగపడే మసాలాలు ఇంట్లో తయారు చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే వట్టి రసం అయినా తీసుకోవచ్చు. ఇలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం వలన అనేక లాభాలని పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…